7/G బృందావన కాలనీ - ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు సెల్వా రాఘవ ఇప్పుడు వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. కెరీర్ లో తమ్ముడు ధనుష్ ఈ స్థాయికి చేరుకున్నాడు అంటే అంతా అన్నయ్య సెల్వా సహకారమనే చెప్పాలి. 

హీరోగా అతను పనికిరాడు అని ఎంత మంది చెప్పినా వినకుండా కాదల్ కొండెన్ తో అవకాశాన్ని ఇచ్చాడు. ఆ సినిమా హిట్టవ్వడంతో అనంతరం మరో రెండు సినిమాలు తమ్ముడితోనే చేసి హిట్స్ ఇచ్చాడు. అయితే ధనుష్ రోజురోజుకి స్టార్ హీరోగా ఎదుగుతుంటే సెల్వా రాఘవన్ మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. రీసెంట్ గా తీసిన ఎన్జికె కూడా ప్లాప్ అవ్వడంతో సెల్వా రాఘవన్ తో చేయడానికి ఏ హీరో ఇంట్రెస్ట్ చూపడం లేదు. 

ఫైనల్ గా అన్నయ్య ఋణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ధనుష్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ నెక్స్ట్ ఇయర్ అన్నయతోనే చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. అందుకోసం ఒక మంచి కథను సెట్ చేయమని సెల్వా రాఘవన్ కి చెప్పినట్లు సమాచారం.