కొన్ని సంఘటనలు వింటానికే విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా సెల్ ఫోన్ వచ్చాక ప్రపంచమే మారిపోయింది. సెల్ఫీల ప్రపంచం అయ్యిపోయింది. సెలబ్రెటీలు ఎవరైనా కనపడితే సెలఫోన్ తో  ఓ సెల్ఫీ తీసుకునేదాకా మనస్సాంతి ఉండటం లేదు. అయితే సెల్ఫీలను చాలా సార్లు విసుక్కుంటున్నా..సెల్ఫీల కోసం చేసే చేష్టలు తిట్టుకునేలా చేసినా , ఒక్కోసారి అవి బాగానే ఉపయోగపుడున్నాయి. అలా సెల్ఫీ ఓ మిస్సైన కుర్రాడిని తన కుటుంబానికి పట్టించింది. 

రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తో  కొందరు సెల్ఫీ దిగారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఆ సంఘటన జరిగింది. ఆ సెల్ఫీ దిగేటప్పుడు ఓ వీడియో ఛానెల్ వాళ్లు వీడియో తీసి, ఆమె క్రేజ్ గురించి చెప్తూ సోషల్ మీడియాలో షేర్ చేసారు. అయితే ఆ వీడియోలో సారా తో సెల్పీ ప్రయత్నించిన కుర్రాడు పేరు అజయ్. అతను పదవతరగతి ఫెయిల్ అవటంతో ఇంట్లో వాళ్ల భయింతో పారిపోయారు. ఆ తర్వాత అతని తండ్రి ఎంత ప్రయత్నించినా ఎడ్రస్ దొరకలేదు. మధ్య ప్రదేశ్ లో ఓ చిన్న టౌన్ వాళ్లది. వాళ్లు ఈ వీడియోని చూడటం తటస్దించింది. తమ కుమారుడు ఎక్కడో చోట ఉన్నాడని సంతోషపడ్డారు. 

అయితే అజయ్ తండ్రి అంతకు ముందే తమ కుమారుడు స్వరూప్ సింగ్ మిస్సయ్యాడని కంప్లైంట్ ఇఛ్చాడు. దాంతో లోకల్ పోలీస్ లు ఆ వీడియో ఆధారం చేసుకుని ఆ కుర్రాడిని వెతికి ఇంటికి తేవటానికి ముంబై వెళ్లారు. మొత్తానికి హీరోయిన్ తో సెల్ఫీ తన కుటుంబానికి అతన్ని పట్టించింది.