దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. కొత్త నటీనటులతో సినిమాలు చేస్తూ విజయాలు అందుకోవడం శేఖర్ కమ్ముల స్టైల్. 'అనామిక' సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు గతేడాది 'ఫిదా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. వరుణ్ తేజ్ కి నటుడిగా మంచి గుర్తింపుని తీసుకురాగా తెలుగు తెరకు సాయి పల్లవి అనే అద్భుత నటిని పరిచయం చేసింది.

ఈ సినిమా తరువాత సాయి పల్లవి కెరీర్ తిరిగి చూసుకోవాల్సిన పని పడలేదు. తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె శర్వానంద్ సరసన 'పడి పడి లేచే మనసు' అనే సినిమాలో నటిస్తోంది. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా సాయిపల్లవికి మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అక్టోబర్ నెలలో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.