అక్కినేని హీరో నాగ చైతన్య ఈ ఏడాది మజిలీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. రియల్ లైఫ్ కపుల్స్ సమంత, చైతు జంటగా నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువతని కూడా ఆకట్టుకుంది. మజిలీ తర్వాత చైతు ప్రతిభగల దర్శకుడు శేఖర్ కమ్ములతో జత కట్టాడు. 

ఈ చిత్రంలో చైతు సరసన క్రేజీ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర సంగీత దర్శకుడి గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఏఆర్ రెహమాన్ వద్ద పనిచేసిన పవన్ అనే కొత్త సంగీత దర్శకుడిని శేఖర్ కమ్ముల ఈ చిత్రం కోసం ఎంచుకున్నారట. 

కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో శేఖర్ కమ్ముల ముందుంటారు. మిక్కీ జె మేయర్, శక్తి కాంత్ లాంటి సంగీత దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏషియన్ సంస్థ నిర్మిస్తోంది. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.