Asianet News TeluguAsianet News Telugu

‘సీటీమార్’:యుస్ ప్రీమియర్స్ పడకపోవటమే పెద్ద హెల్ప్

గత కొద్ది నెలలుగా థియోటర్స్ లోకి సినిమాలైతే వస్తున్నాయి కానీ.. గట్టిగా హిట్టు కొట్టి జనాలు రావటం మాత్రం జరగటం లేదు. రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా.. ప్రేక్షకులని థియేటర్లకి రప్పించడంలో అవి పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి.  

Seetimaarr not having any USA premieres, it worked
Author
Hyderabad, First Published Sep 11, 2021, 8:42 AM IST

యుస్ లో ప్రీమియర్స్ పడటం, టాక్ రావటం చాలా సార్లు పెద్ద సినిమాలకు కలిసొస్తుంది. అదే సమయంలో ఒక్కోసారి ఆ టాక్ సినిమాని దెబ్బ కూడా కొడుతుంది. అక్కడ టాక్ తేడాగా ఉందని మొదట టాక్ వస్తే అది ఓపెనింగ్స్ మీద పడుతుంది. అయితే గోపిచంద్ తాజా చిత్రం   ‘సీటీమార్’కు యుస్ ప్రీమియర్స్ పడలేదు. అదే ఎడ్వాంజేటి అయ్యింది అంటోంది ట్రేడ్. 

కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఓపెన్ అయిన థియేటర్లలోకి వచ్చిన మాస్ సినిమా  ‘సీటీమార్’. గత కొద్ది నెలలుగా థియోటర్స్ లోకి సినిమాలైతే వస్తున్నాయి కానీ.. గట్టిగా హిట్టు కొట్టి జనాలు రావటం మాత్రం జరగటం లేదు. రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా.. ప్రేక్షకులని థియేటర్లకి రప్పించడంలో అవి పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఈ నేపధ్యంలో మంచి మాస్ సినిమా పడితేనే.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని,  ఇది అలాంటి చిత్రమే అని ‘సీటీమార్’ చిత్ర దర్శకనిర్మాతలు చెబుతూ వస్తున్నారు. 

హీరో గోపీచంద్ కూడా ఇలాంటి సినిమాలను థియేటర్లలో చూస్తూనే మజా వస్తుందనే.. థియేటర్లలో విడుదల చేస్తున్నామని చెప్పారు. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులని థియేటర్లకు రప్పిస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పారు.  ఈ నేపధ్యంలో విడుదలైన ఈ సినిమాకు వేరే కారణాలతో  యుఎస్ ప్రీమియర్స్ పడలేదు. దాంతో అక్కడ టాక్ బయిటకు రాలేదు. సాధారణంగా యుఎస్ లో మాస్ సినిమాలు రిలీజ్ అయితే టాక్ తేడాగా వస్తూంటుంది. అక్కడ ఆడియన్స్ వేరు. దాంతో ఓ రకంగా ఇది మంచిదైంది అంటున్నారు. అలా టాక్ రాకపోవటంతో మార్నింగ్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పడి, టాక్ వచ్చేదాకా సినిమా విషయం ఏమిటనేది తెలియలేదు. ఇది ప్లస్ అయ్యిందంటున్నారు ఓపినింగ్స్ కు. 

 ఇక ఈ సినిమా మాస్ సెంటర్లలో బాగానే వర్కవుట్ అయ్యేటట్లు ఉంది. ముఖ్యంగా సీ సెంటర్లలలో  కూర్చున్న ప్రేక్షకులు లేచి సీటీలు కొట్టేలా కొన్ని సీన్లు బాగానే పండాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓవరాల్‌గా పండగ టైమ్‌లో ప్రేక్షకులు ఎలాంటి సినిమా అయితే చూడాలని అనుకుంటారో.. అలాంటి సినిమానే ఇది అని ప్రేక్షకులు అంటున్నారు. కాకపోతే అన్నివర్గాల ప్రేక్షకులకు కాకుండా కొందరినే టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది అంటోంది ట్రేడ్. 
 

Follow Us:
Download App:
  • android
  • ios