టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల కూతురు సీతార సోషల్ మీడియాలో మరోసారి అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. చిన్నప్పటి నుంచి నాన్నతో పాటు సెలబ్రెటీ హోదా అందుకున్న ఈ చిన్నారి ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్ తో మెప్పించేందుకు సిద్ధమవుతోంది. 

మహేష్ సినిమాలకు సంబందించిన పాటలతో నిత్యం ఇంటర్నెట్ లో హల్ చేసే ఈ క్యూట్ గర్ల్ గత కొన్ని రోజులుగా సంప్రదాయబద్ధమైన నృత్యంలో శిక్షణ తీసుకొంటోంది. ఫస్ట్ లెవెల్ కూడా పూర్తి చేసిందట. గురువు అరుణ భిక్షు గారి సమక్షంలో ఎంతో చక్కగా మొదటి లెవెల్ ను పూర్తి చేసినట్లు నమ్రత ఒక ఫోటో షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. 

ఇక నెక్స్ట్ టైమ్ మహేష్ డైలాగ్స్ సాంగ్స్ తో పాటు డ్యాన్సులతో కూడా సీతారా హడావుడి చేసే సన్నివేశాలు చూడవచ్చన్నమాట. చూస్తుంటే సినిమాల్లో కూడా క్యూట్ గర్ల్ నటిస్తుందేమో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.