Asianet News TeluguAsianet News Telugu

సీరత్ కపూర్ ను టచ్ చేస్తే.. చూడు వుంది అంటోంది

  • మాస్ మహారాజ రవితేజ టచ్ చేసి చూడు వుంది
  • విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సీరత్ హిరోయిన్
  • మూవీ ఆగిపోయిందంటూ వచ్చిన రూమర్స్ కు తాజాగా పుల్ స్టాప్ పెట్టిన సీరత్ 
seerath kapoor clarifies on ravi teja touch chesi choodu

మాస్ మహారాజా రవితేజ ప్రస్థుతం కాస్త రిలాక్సింగ్ గా నే వున్నట్లున్నాడు. డ్రగ్స్ కేసు ఆరోపణలు, సోదరుడు భరత్ మృతి లాంటి ఘటనలతో డిస్ట్రబ్ అయిన రవితేజ... నెమ్మదిగా కోలుుకున్నాడు. ప్రస్థుతం రవితేజ నటించిన రాజా ది గ్రేట్ రిలీజ్ కు కూడా రెడీ అయింది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. చివరి సినిమా ‘బెంగాల్ టైగర్’ తర్వాత ఏడాది పైగా షూటింగ్ లేకుండా ఖాళీగా గడిపిన రవితేజ.. ఓకేసారి ‘టచ్ చేసి చూడు’, ‘రాజా ది గ్రేట్’ సినిమాలు మొదలెట్టేశాడు.

 

రలితేజ ఈయేటి ప్రాజెక్టుల్లో ముందు మొదలైంది ‘టచ్ చేసి చూడు’ సినిమానే. విక్రమ్ సిరి అనే కొత్త దర్శకుడితో రవితేజ ఈ సినిమాను ఆరంభించాడు. కానీ ఏం జరిగిందో ఏమో ఆ సినిమా ముందుకు కదల్లేదు. మధ్యలో మాస్ రాజా ‘రాజా ది గ్రేట్’ మీదికి వెళ్లిపోయాడు. చకచకా ఆ సినిమా పూర్తి చేసేశాడు. ఆ సినిమా విడుదలకు కూడా సిద్ధమైపోయింది. కానీ ‘టచ్ చేసి చూడు’ సంగతేంటో తేలలేదు.



ఇంతలోనే శ్రీను వైట్ల దర్శకత్వంలో తన కొత్త సినిమా మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు రవితేజ. విక్రమ్ సిరి పనితీరు నచ్చక.. ఔట్ పుట్ మీద అసంతృప్తితో ‘టచ్ చేసి చూడు’ను రవితేజ పక్కన పెట్టేశాడని గుసగుసలు వినిపిస్తుండగా.. ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటిస్తున్న రింగు జుట్టు సుందరి సీరత్ కపూర్ మాత్రం దీనికి భిన్నమైన వ్యాఖ్యలు చేసింది.

 

‘రాజు గారి గది-2’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసినపుడు ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ... ‘టచ్ చేసి చూడు’ ప్రస్తావన తెచ్చింది సీరత్. ఆ సినిమాలో తనది కీలక పాత్ర అని.. అది మంచి సినిమా అవుతుందని వ్యాఖ్యానించిందామె. దీన్ని బట్టి చూస్తే ‘టచ్ చేసి చూడు’ మరుగున పడిపోలేదని స్పష్టమవుతోంది. త్వరలోనే ఆ ప్రాజెక్టు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుందన్నమాట.

Follow Us:
Download App:
  • android
  • ios