మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో చిత్ర యూనిట్ క్రమంగా ప్రచార కార్యక్రమాల వేగం పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, తొలి సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

వరుణ్ తేజ్ మునుపెన్నడూ లేని విధంగా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. జర్రా జర్రా అంటూ సాగే స్పెషల్ సాంగ్ ని ఇటీవల విడుదల చేశారు. మాస్ బీట్ తో సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ ఆ సాంగ్ ని అద్భుతంగా ట్యూన్ చేశాడు. తాజాగా చిత్ర యూనిట్ సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేసింది. 

'గగన వీధిలో' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ వినసొంపుగా ఉంది. మిక్కీ జె మేయర్ తనదైన శైలిలో ఈ పాటకు మ్యూజిక్ అందించాడు. ప్రముఖ గేయ రచయిత వనమాలి ఈ పాటకు అచ్చ తెలుగులో లిరిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి, స్వేత సుబ్రహ్మణ్యం ఈ పాటకు సింగర్స్.