‘వీర సింహారెడ్డి’ రెండో పాట వచ్చేసింది.. క్లాస్, మాస్ కలిపి ఉతికారేసిన బాలయ్య - శృతి హాసన్!
నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. విడుదలకు సిద్ధం అవుతుండగా.. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. తాజాగా మూవీ నుంచి రెండో పాట విడుదలైన దుమ్ములేపుతోంది.

నందమూరి నటసింహం, సీనియర్ నటుడు బాలయ్య (Balakrishna) - శృతి హాసన్ (Shruti Haasan) జంటగా నటిస్తున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం ప్రస్తుతం తుదిమెరుపులు దిద్దుకుంటోంది. సరిగ్గా నెలరోజుల్లో థియేటర్లలో దుమ్ములేపబోతున్న చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. తాజాగా రొమాంటిక్ సాంగ్ గా సెకండ్ సింగిల్ ను విడుదల చేశారు. ‘సుగుణ సుందరి’ టైటిలతో విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్ లో దుమ్ములేపుతోంది.
వింటేజ్ వైబ్స్ ను చూపించేలా రెండో పాట ఉండటం విశేషం. బాలయ్య, శృతి హాసన్ అదిరిపోయే డాన్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ కు ప్రముఖ సాహిత్య కారుడు రామజోగయ్య శాస్త్రి ట్రెండీ లిరిక్స్ అందించారు. స్టార్ సింగర్ రామ్ మిరియాల - స్నిగ్ధ శర్మ కలిసి ఆలపించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ క్యాచీ ట్యూన్ ను అందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. సాంగ్ లో చాలా బ్యూటీఫుల్ గా ఉంది. బాలయ్య వింటేజ్ లుక్ వైబ్స్ ఆకట్టుకుంటున్నాయి. విదేశాల్లోని అద్భుతమైన లోకేషన్లలో సాంగ్ షూట్ చేయడం మరింత ఆకర్షణీయంగా ఉంది.
మూవీలో బాలయ్య గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ ట్రీట్ అందించబోతున్నారు. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ఫస్ట్ సింగిల్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.