పుష్ప 2 విడుదలకు చాలా సమయం ఉంది. ప్రమోషన్స్ మాత్రం హోరెత్తిస్తున్నారు టీమ్. నేడు సెకండ్ సింగిల్ 'సూసేకి' విడుదల చేశారు. అయితే పార్ట్ 1లోని 'సామి సామి' సాంగ్ లో ఉండే మాస్ ఫీల్ ఈ సాంగ్ లో మిస్ అయ్యింది.  

పుష్ప సక్సెస్ అల్లు అర్జున్ ఇమేజ్ పతాక స్థాయికి చేర్చింది. నార్త్ ఇండియాలో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. పుష్ప వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో పుష్ప సీక్వెల్ ని దర్శకుడు సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 వరల్డ్ వైడ్ ఆగస్టు 15న పలు భాషల్లో విడుదల కానుంది. విడుదలకు రెండు నెలలకు పైగా సమయం ఉంది. అయినప్పటికీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేశారు. 

అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా 'పుష్ప పుష్ప' సాంగ్ విడుదల చేశారు. దీనికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. పుష్ప 2లో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎంత వైల్డ్ గా ఉంటుందో 'పుష్ప పుష్ప' సాంగ్ లో గొప్పగా చెప్పారు. కాగా నేడు సెకండ్ సింగిల్ 'సూసేకి' విడుదల చేశారు. ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా ఓ ప్రమోషనల్ వీడియో వదిలారు. సాంగ్ ప్రాక్టీస్ సెషన్ షూట్ చేసి సాంగ్ కి అనుసంధానించి విడుదల చేశారు. 

'సూసేకి' సాంగ్ ని శ్రేయ ఘోషల్ పాడారు. పుష్ప పార్ట్ 1 లో ఇదే తరహాలో 'సామి సామి ' సాంగ్ ఉంటుంది. సినిమాకు ఆ పాట హైలెట్ గా నిలిచింది. మాంచి మాస్ అప్పీల్ తో సామి సామి సాంగ్ ఉంటుంది. మౌనిక యాదవ్ వాయిస్ బాగా సెట్ అయ్యింది. సూసేకి సాంగ్ ని శ్రేయ ఘోషల్ పాడటం వలన ఆ మాస్ అప్పీల్ రాలేదు. శ్రేయ ఘోషల్ వాయిస్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. దాని వలన సామి సామి సాంగ్ ని సూసేకి సాంగ్ మైమరిపించలేకపోయింది. 

ఈ సాంగ్ కి చంద్రబోస్ సాహిత్యం అందించారు. ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య, విజయ్ పోలాకి, శ్రేష్టి వర్మ నృత్యం సమకూర్చారు. మరి నెటిజెన్స్ నుండి సూసేకి సాంగ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

YouTube video player