‘ఫిబ్రవరి 25’ ఇటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), అటు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మూవీలకు చిక్కు తెచ్చిపెట్టింది. ఆ రోజునే తమ సినిమాలను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అదే రోజు పెద్ద సినిమా రిలీజ్ అవుతుండటంతో తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందంటూ నెట్టింట చర్చ జరుగుతోంది.    

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ‘గని’, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘సెబాస్టియన్’ మూవీలు ఈ నెల 25న రిలీజ్ కానున్నాయి. గత నెల రోజుల నుంచి కరోనా పరిస్థితులు అదుపులోకి రావడంతో పెద్ద సినిమాల నుంచి సినిమాల వరకు ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్లను బ్లాక్ చేసుకుంటూ వచ్చాయి. అయితే ఫిబ్రవరి 25న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మూవీని రిలజ్ చేస్తున్నట్టు ఫిబ్రవరి 1నే ప్రకటించారు. అలాగే వరుణ్ తేజ్ మూవీ ‘గని’(Ghani) మేకర్స్ మాత్రం రెండు డేట్లను బ్లాక్ చేస్తూ రీలీజ్ డేట్స్ అప్డేట్ అందించారు. కుదిరితే ఫిబ్రవరి 25, లేదంటే మార్చి 4న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ నిన్న మళ్లీ అప్డేట్ ఇస్తూ ‘ఫిబ్రవరి 25నే లాక్ చేస్తున్నట్టు తెలిపారు. 

కరోనా పరిస్థితులు పెద్ద సినిమాల రిలీజ్ లను గమనించిన ‘భీమ్లా నాయక్’ మేకర్స్ చివరిసారిగా అప్డేట్ ఇస్తూ రెండు రిలీజ్ డేట్లను బ్లాక్ చేశారు. అయితే ‘ఫిబ్రవరి 25’ లేదంటే ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ఇటీవల అందరూ తమ సినిమాలను ముందే రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సెబాస్టియన్ మొదటి చెప్పిన డేట్ నే ఇంకా కొనసాగిస్తున్నారు. మరోవైపు నిన్న ‘గని’ మూవీని ఫిబ్రవరి 25నే రిలీజ్ చేస్తామంటూ కూడా అప్డేట్ అందించారు. 

ఈ ఉదయం ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని కూడా ఫిబ్రవరి 25కే రిలీజ్ చేసేందుకు లాక్ చేశారు మేకర్స్. అందరూ ఏప్రిల్ 1నే భీమ్లా నాయక్ రిలీజ్ అవుతుందని అనుకున్నా.. ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తూ షాకిచ్చారు భీమ్లా నాయక్ మేకర్స్. దీంతో ప్రస్తుతం గని, సెబాస్టియన్ మూవీలకు కొంత దెబ్బపడనుంది. పవన్ క్రేజ్ ముందు వీరి సినిమాలు చిత్తుకాక తప్పవు. ఈ సందర్భంలో తమ సినిమాల రిలీజ్ కు మరో డేట్ చూసుకునే పనిలో మేకర్స్ నిమగ్నమైనట్టు పలువురు అంటున్నారు. ఈ మేరకు నెట్టింట కూడా చర్చ జరుగుతోంది. చూడాలని మరీ.. ఫిబ్రవరి 25నే ఈ మూడు సినిమాలు రిలీజ్ అవుతాయో.. లేదా దారి మరల్చుతాయో. ఒకవేల ఈ మూడు సినిమాలు ఒకే రోజు రిలీజైతే థియేటర్లు కళకళలాడుతాయని ఫ్యాన్స్ అంటున్నారు.