హెల్త్ అప్డేట్ తో వీడియో రిలీజ్ చేసిన సాయాజీ షిండే

 మరోసారి ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే అతడికి యాంజియోప్లాస్టీ చేశామని.. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని, మరో రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని 

Sayaji Shinde Undergoes Angioplasty After Severe Chest Pain, Shares Health Update jsp


 సీనియర్ నటుడు సాయాజీ షిండేకు వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే. సాయాజీ షిండే కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మహారాష్ట్రలోని సతారాలో నిన్న ఛాతీలో నొప్పికి గురైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటీన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 

వైద్య పరీక్షలు నిర్వహించగా, ఈసీజీలో మార్పులు కనిపించాయి. దాంతో, యాంజియోగ్రఫీ పరీక్షకు వైద్యులు సిఫారసు చేశారు. సాయాజీ షిండేకు గుండె కుడివైపున 99 శాతం బ్లాక్స్ ఉన్నట్టు ఆ పరీక్షలో వెల్లడైంది. దాంతో ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. ఈ నేపధ్యంలో సాయాజీ షిండే సైతం తన అభిమానులు కంగారుపడద్దు అంటూ తాను బాగానే ఉన్నానని ఇనిస్ట్రాలో వీడియో విడుదల చేసారు.

ఇక డాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ... కొన్ని రోజుల క్రితం సాయాజీ షిండేకు ఛాతిలో నొప్పి వచ్చిందని.. దీంతో వెంటనే ఆసుపత్రికి వచ్చి కొన్ని సాధారణ పరీక్షలు చేయించుకున్నారని అన్నారు వైద్యులు. ఈసీజీ టెస్ట్ చేగా.. అతడి 2D ఎకోకార్డియోగ్రఫీని పూర్తి చేసినప్పుడు.. గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆ తర్వాత   మరోసారి ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే అతడికి యాంజియోప్లాస్టీ చేశామని.. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని, మరో రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సాయాజీ షిండే త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios