Asianet News TeluguAsianet News Telugu

#SawX:ఈ మూడు టాప్ Horror సినిమాలు OTT తెలుగులో ...

 హారర్ మూవీ లవర్స్ కోసం ఓటీటీ సంస్థలు కూడా ఈ తరహా సినిమాలను స్ట్రీమింగ్ చేస్తుంటాయి. 

Saw X Ott Release Date Hollywood Horror Movie To Stream In Lionsgate Play Ott News In Telugu jsp
Author
First Published Feb 14, 2024, 8:09 AM IST | Last Updated Feb 14, 2024, 8:09 AM IST


భయపెట్టే హారర్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన  ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే వాటిల్లో  సీట్ ఎడ్జ్ లో కూర్చొపెట్టే సినిమాలే సూపర్ హిట్ అవుతుంటాయి. అందుకే హారర్ మూవీ లవర్స్ కోసం ఓటీటీ సంస్థలు కూడా ఈ తరహా సినిమాలను స్ట్రీమింగ్ చేస్తుంటాయి.  ప్రముఖ ఓటీటీ దిగ్గజాలు నెట్‌ఫ్లిక్స్,  లయన్స్‌గేట్ ప్లే ల లో ఈ సినిమాలు స్ట్రీమింగ్ అవుతూంటాయి.  ఈ క్రమంలోనే ఓటీటీలోకి మరో హాలీవుడ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఆ సినిమానే  సా టెన్ (SAW X).  
 
 టోబిన్ బెల్ నటించిన  సా టెన్ (SAW X) సినిమా ఫిబ్రవరి 23 నుంచి లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play)లో స్ట్రీమింగ్ కానుంది. గతేడాది సెప్టెంబర్ 29న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. 13 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 111 మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసింది. సా ఫిల్మ్ సిరీస్ లో ఇది పదో మూవీ. 2004లో ఈ సీక్వెల్ లో మొదటి సినిమా వచ్చింది. ఆ తర్వాత 2010 వరకూ ప్రతి ఏడాది ఈ సా హారర్ ఫ్రాంఛైజీ నుంచి ఒక్కో సీక్వెల్ రిలీజైంది. ఆ తర్వాత ఏడేళ్ల గ్యాప్ తో 2017లో జిగ్సా మూవీ రిలీజైంది, ఇది ఫ్రాంఛైజీలో వచ్చిన 8వ మూవీ. ఇక 2021లో స్రైరల్ పేరుతో 9వ సినిమా రాగా.. 2023లో సా టెన్ రిలీజైంది.

ఇంతకీ  సా టెన్ కథేమిటంటే...ఈ సినిమాలో  హీరో క్యాన్సర్ తో బారిన పడి చికిత్స కోసం మెక్సికో వెళ్తాడు. అక్కడ ఓ ప్రయోగాత్మక ట్రీట్మెంట్  కోసం సిద్ధమవుతాడు. ఆ తర్వాత అదంతా ఓ స్కామ్ అని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ సా టెన్ మూవీ కథ.

ఇదిలా ఉంటే  జియో సినిమాలోకి మరో హాలీవుడ్ హారర్ మూవీ ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ వచ్చింది. ‘ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్’సినిమాను తెలుగులోనూ చూడొచ్చు. ‘ది ఎగ్జార్సిస్ట్’ మూవీ హాలీవుడ్‌లోని ప్రముఖ హారర్ ఫ్రాంచైజీ సినిమాలలో ఒకటి అనే విషయం తెలిసిందే.  హారర్ ఫ్రాంచైజ్ చిత్రాలకు హైప్ క్రియేట్ చేసిందే ‘ది ఎగ్జార్సిస్ట్’.నాలుగు నెలల క్రితం ‘ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్’ అనే మరో సినిమా కూడా థియేటర్లలో విడుదలయ్యి ఆడియన్స్‌ను భయపెట్టింది. ఓవర్సీస్‌లో నాలుగు నెలల క్రితం విడుదలయిన ఈ మూవీ.. ఇప్పుడు ఇండియాలో ఓటీటీలో విడుదలైంది.

 1973లో ‘ది ఎగ్జార్సిస్ట్’ ఫ్రాంచైజ్ నుండి మొదటి మూవీ విడుదలయ్యింది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజ్‌లో ఆరు సినిమాలు తెరకెక్కగా.. అందులో ప్రతీ ఒక్కటి ప్రేక్షకులను అలరించింది. తాజాగా ‘ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్’ కూడా అందులో యాడ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జియో సినిమాలో ‘ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్’ స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.  
 
అలాగే  ‘ది నన్ 2’ అనే హారర్ మూవీ కూడా ఓటిటిలో  విడుదలయ్యింది.  ‘ది నన్ 2’చిత్రం 2018లో విడుదలయిన ‘ది నన్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ‘ది నన్ 2’. ‘ది నన్’ అప్పట్లో కంజ్యూరింగ్ యూనివర్స్‌లోని సినిమాగా విడుదలయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక దానికి సీక్వెల్‌గా సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ది నన్ 2’. థియేటర్లలో ప్రేక్షకులను ఓ రేంజ్‌లో భయపెట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సీక్వెల్.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.  ‘ది నన్ 2’ కూడా జియో సినిమాలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళంలో కూడా ‘ది నన్ 2’ స్ట్రీమ్ అవుతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios