Asianet News TeluguAsianet News Telugu

సవ్యసాచి యూఎస్ ప్రీమియర్ షో టాక్!

శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో పరవాలేదనిపించిన నాగ చైతన్య  ఈ సారి ఎలాగైనా యాక్షన్ కథతో బాక్స్ ఆఫీస్ హాట్ అందుకోవాలని సవ్యసాచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా చైతూ సినిమా ప్రయోగాత్మకంగా తెరకెక్కడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
 

savyasachi premier show talk
Author
Hyderabad, First Published Nov 2, 2018, 6:12 AM IST

 

శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో పరవాలేదనిపించిన నాగ చైతన్య  ఈ సారి ఎలాగైనా యాక్షన్ కథతో బాక్స్ ఆఫీస్ హాట్ అందుకోవాలని సవ్యసాచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా చైతూ సినిమా ప్రయోగాత్మకంగా తెరకెక్కడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

అయితే యూఎస్ లో కూడా సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు. ముందుగానే ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. ఆ టాక్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..

ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టైల్ లో నడిచే సవ్యసాచి సెకండ్ హాఫ్ మాత్రం ఉహాలకందని విధంగా ఉంది. పది నిమిషాల్లో పద్మవ్యూహం అంటూ ఇంటర్వెల్ అనంతరం దర్శకుడు కథను మలిచిన తీరు ఆడియెన్స్ ని థ్రిల్లింగ్ కి గురి చేస్తోంది. ముఖ్యంగా మాధవన్ - నాగ చైతన్యల మధ్య జరిగే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. అక్కడక్కడా కొద్దిగా స్లోగా అనిపించినా డైరెక్టర్ చందు ఓవరాల్ గా తాను చెప్పాలనుకున్న పాయింట్ ను కామన్ ఆడియెన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేసే విధంగా ప్రజెంట్ చేశాడు.

సినిమాలో సుభద్ర పరిణయం కాన్సెప్ట్ హైలెట్ అని చెప్పవచ్చు. ఇక ఫైట్స్ ఆడియెన్స్ కి మంచి కిక్ ఇస్తాయి. తన కంట్రోల్ లో లేని చేయితో కథానాయకుడికి ఎదురైన అనుభవాలు అతను వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశం క్లయిమాక్స్ వరకు ఉత్కంఠగా అనిపిస్తుంది. 

డైరెక్టర్ చందు లవ్ సీన్స్ ని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. కథకు తగ్గట్లుగా సాంగ్స్ ఫైట్స్ ని సెట్ చేసుకున్నాడు. ఇక సినిమాకు బలాన్ని ఇచ్చే అంశం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఎమ్ఎమ్.కీరవాణి మరోసారి తన విజన్ ని చూపించారు. మ్యూజిక్ తో సీన్స్ కి ఏ స్థాయిలో బలం చేకూరుతుందో ఈ సినిమా ఒక ఉదాహరణ. 

పాటలను కూడా చాలా బాగా తెరకెక్కించారు. చైతన్య డ్యాన్స్ కూడా ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాలో మరో హైలెట్ పాయింట్. ఫస్ట్ హాఫ్ లవ్ సీన్స్ తో ఎంటర్టైన్ గా సాగే కథలో మాధవన్ ఎంట్రీ ఊహించని మలుపు. 

చైతూ - మాధవన్ ల మధ్య జరిగే మైండ్ గేమ్ సినిమాలో మరో హైలెట్ పాయింట్. ఫస్ట్ హాఫ్ లో సినిమా కొంచెం బోర్ అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం ఏ మాత్రం నిరాశపరచదనే టాక్ వైరల్ అవుతోంది. నిధి అగర్వాల్ - భూమికల నటన కూడా బావుంటుంది. ఇక ఈ దీపావళికి కథానాయికుడు నాగ చైతన్య మాంచి హిట్ అందుకుంటాడాని చెప్పవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios