హీరోయిన్స్ కు ఒక్క హిట్టు వస్తే చాలు వరుసగా ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. టాలీవుడ్ లో అయితే సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా అందరితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇకపోతే ప్రస్తుతం ఇద్దరు కొడుకులతో నటించిన ఓ బ్యూటీ తండ్రితో కూడా నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపింది. 

సవ్యసాచి బ్యూటీ నిధి అగర్వాల్ నాగచైతన్య కు జోడిగా నటించి మంచి మార్కులు కొట్టేసినట్లు తెలుస్తోంది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే యువ హీరో నాగచైతన్య తో కూడా నటిస్తోంది. మిస్టర్ మజ్ను సినిమాలో ఆమె నటిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అమ్మడు ఈ విషయంపై స్పందించింది. 

అక్కినేని యువ హీరోలతో నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక నాగార్జున సర్ గురించి చాలా విన్నాను. ఆయనతో కూడా నటించాలని ఉందని చెబుతూ భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని నిధి వివరణ ఇచ్చింది. మొత్తానికి అమ్మడు కొడుకులను కవర్ చేసి తండ్రితో కూడా స్క్రీన్ షేర్ చేసుకొని ఎవరు అందుకొని ఫీట్ ను అందుకోవాలని చూస్తోంది.