Asianet News TeluguAsianet News Telugu

'సవ్యసాచి' ఫస్ట్ డే కలెక్షన్స్!

అక్కినేని నాగ చైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'సవ్యసాచి'. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. చైతు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. 

savyasachi first day collections
Author
Hyderabad, First Published Nov 2, 2018, 2:50 PM IST

అక్కినేని నాగ చైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'సవ్యసాచి'. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. చైతు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకోవడంతో సినిమా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో నిర్వహించారు. దీంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ఊహించని విధంగా మిశ్రమ స్పందన వస్తుంది.

అమెరికాలో ప్రీమియర్ షోలు ముందే ప్రదర్శితం కావడంతో అక్కడ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అమెరికాలో 87 లోకేషన్స్ లో విడుదలైన ఈ సినిమా నవంబర్ 1 నాటికి 74,667 డాలర్లు రాబట్టినట్లు ట్రేడ్ అనలిస్ట్ లు ట్వీట్ లు చేస్తున్నారు.

ఈ ఏడాది విడుదలైన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా 107,448 డాలర్లు, ప్రేమమ్ 74,219 డాలర్లను రాబట్టింది. సాయంత్రానికి సినిమా ఎన్ని వసూళ్లను రాబడుతుందో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి.. 

‘స‌వ్య‌సాచి’మూవీ రివ్యూ

'సవ్యసాచి' ట్విట్టర్ రివ్యూ..!

సవ్యసాచి యూఎస్ ప్రీమియర్ షో టాక్!

 

Follow Us:
Download App:
  • android
  • ios