సావిత్రి కూతురు ఏం చెప్పిందంటే..!

savitri's daughter about her mother
Highlights

మహానటి సావిత్రి తన జీవితంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవడానికి తన భర్త జెమినీ గనేషన్

మహానటి సావిత్రి తన జీవితంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవడానికి తన భర్త జెమినీ గనేషన్ ప్రధాన కారణమని కొందరు అంటుంటారు. ఒకరిని వివాహం చేసుకొని, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న జెమినీ.. సావిత్రిని మోసం చేసుకొని పెళ్లి చేసుకొని ఆమె ఆర్థికంగా నష్టపోయేలా చేశారని ఇలా రకరకాలా ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించింది సావిత్రి కూతురు విజయ ఛాముండేశ్వరి.

తన తల్లి తమకు ఏది మిగల్చకుండా దివాళా తీశారని వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. సావిత్రి చనిపోయే సమయానికి తమ వద్ద నాలుగు ఇళ్లు ఉన్నాయని, వాటితోనే తను, తన తమ్ముడు సెటిల్ అయినట్లుగా ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె చెన్నైలో విలాసవంతమైన ఓ అపార్ట్ మెంట్ లో ఉన్నట్లు తెలిపారు. ఇక తన తండ్రి జెమినీ గనేషన్.. సావిత్రిని మోసం చేశారనే విషయంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.

ఐటి అధికారుల దాడుల్లో అలానే కొందరు బంధువుల కారణంగా తన తల్లి ఆస్తులు పోగొట్టుకున్నట్లు తెలిపారు. 'మహానటి' సినిమాలో ఎక్కువగా చూపించలేదు.. కానీ తెలిసినవాళ్ళు చేసిన మోసం కారణంగానే మా అమ్మ ఆర్థికంగా నష్టపోయిందని అన్నారు. ఇక జెమినీ గనేషన్ మొదటి భార్యతో కూడా తమకు ఎలాంటి విభేదాలు లేవని చాలా స్నేహంగా ఉండేవాళ్లమని ఛాముండేశ్వరి తెలిపారు.   

loader