కంటెంట్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుంటూ త‌నదైన శైలిలో న‌టిస్తూ ప్రేక్ష‌కాభిమానం సొంతం చేసుకుంటున్న యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కీబ్యూటీ త‌మన్నా జంటగా న‌టిస్తున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న ర‌వి లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ నేడు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర హీరో స‌త్య‌దేవ్, ద‌ర్శ‌కనిర్మాత నాగ‌శేఖ‌ర్, సంగీత ద‌ర్శ‌కుడు కాల‌భైర‌వ‌, సినిమాటోగ్రాఫ‌ర్ స‌త్య హెగ్ఢే, చిత్ర యూనిట్ స‌భ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా హీరో సత్యదేవ్‌ మాట్లాడుతూ.. `గుర్తందా శీతాక‌లం చిత్రంలో న‌టించేందుకు నాకు అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత నాగ‌శేఖ‌ర్ గారికి ప్ర‌త్యేఖ కృత‌జ్ఞ‌త‌లు, ఈ సినిమాలో నా పాత్ర చాలా ఎమోష‌న‌ల్ గా ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ త‌మ‌న్నాగారితో క‌లిసి న‌టించడం చాలా ఆనందంగా ఉంది. హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాల‌భైర‌వ ఈ చిత్రానికి అద్భుత‌మైన ట్యాన్స్, నేప‌థ్య సంగీతాన్ని ఇస్తార‌ని ఆశిస్తున్నాను` అన్నారు.
"