సారాంశం
యువ నటుడు సత్యదేవ్ విభిన్నమైన పాత్రలు, అద్భుత అవకాశాలతో రాణిస్తున్నాడు. సత్యదేవ్ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంచుకుంటూ ఆడియన్స్ కి బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలు అందిస్తున్నాడు.
యువ నటుడు సత్యదేవ్ విభిన్నమైన పాత్రలు, అద్భుత అవకాశాలతో రాణిస్తున్నాడు. సత్యదేవ్ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంచుకుంటూ ఆడియన్స్ కి బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలు అందిస్తున్నాడు. ఘాజి, అంతరిక్షం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, తిమ్మరుసు లాంటి చిత్రాలతో సత్యదేవ్ గుర్తింపు పొందాడు.
గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో సత్యదేవ్ ప్రధాన విలన్ గా అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. 2021లో సత్యదేవ్ నటించిన తిమ్మరుసు చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది.
ఈ చిత్రాన్ని శరన్ కొప్పిశెట్టి తెరకెక్కించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లోనే మరో వైవిధ్యమైన చిత్రం రాబోతోంది. ఫుల్ బాటిల్ అనే టైటిల్ తో వీరి కాంబోలో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. కోస్టల్ ఏరియాలో ఉంటూ ఎప్పుడూ మద్యం మత్తులో మునిగితేలే కుర్రాడిగా ఈ చిత్రంలో సత్యదేవ్ నటిస్తున్నాడు.
సత్యదేవ్ వ్యక్తిగా స్టయిల్ కి ఇది డిఫెరెంట్ అటెంప్ట్. ఫన్నీ డైలాగ్ డెలివరీతో సత్యదేవ్ ఆకట్టుకుంటున్నాడు. రగ్గడ్ లో, చిల్లరగా తిరిగే యువకుడిగా సత్యదేవ్ నటన మెప్పిస్తోంది. మేము బాలయ్య బాబు ఫ్యాన్స్.. బ్రహ్మ ముహూర్తంలో లేస్తాం అంటూ సత్యదేవ్ చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో యాక్టిన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అయితే దర్శకుడు కథ గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు. శ్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.