తాను తీసిన సినిమా మీద ఒక డైరెక్టర్ కు ఎంత నమ్మకమైనా ఉండొచ్చు. ఆ నమ్మకంతో ఇష్టానుసారం కామెంట్లు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ‘మనసుకు నచ్చింది’ సినిమాతో రుజువవుతోంది. తానో కళాఖండం తీసినట్లుగా మాట్లాడుతూ.. మనసున్న ప్రతి ఒక్కరినీ ఈ సినిమా నచ్చుతుందని.. ఇది నచ్చని వాళ్లు వేస్ట్ ఫెలోస్ అని పెద్ద కామెంట్ చేసేసింది మంజుల. ఆ మాట విని అందరూ అవాక్కయ్యారు. ఇప్పుడు రిలీజ్ తర్వాత మంజుల మీదికి రివర్స్ అటాక్ మొదలైంది. ఈ సినిమా చూసిన వాళ్లందరూ మంజుల మీద మామూలుగా సెటైర్లు వేయట్లేదు.

నాకీ సినిమా నచ్చలేదు.. నేనో వేస్ట్ ఫెలో అంటూ మంజులను ఉద్దేశించి సెటైర్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ ఈ సినిమా నచ్చలేదని కాబట్టి అందరూ వేస్ట్ ఫెలోసే అని కూడా కొందరంటున్నారు. మంజుల దర్శకత్వంలో నటిస్తే అదే తన చివరి సినిమా అవుతుందంటూ తన కొడుకు దగ్గర మహేష్ బాబు సరదాగా చేసిన కామెంట్ ను కూడా జనాలు ప్రస్తావిస్తున్నారు. ఈ సినిమా చూసి ఛోటా కే నాయుడు అద్భుతం అన్నట్లు.. కథ విని సాయిమాధవ్ బుర్రా ఆహా అన్నట్లు మంజుల చేసిన కామెంట్లను కూడా గుర్తు చేస్తూ అంతన్నాడింతన్నాడే.. అనే పాటను గుర్తు చేసి మరీ మంజులను ట్రోల్ చేస్తున్నారు జనాలు. అందుకే అనేది సినిమా మాట్లాడాలి కానీ.. సినిమా తీసిన వాళ్లు ఎక్కువ మాట్లాడకూడదు అని.