Asianet News TeluguAsianet News Telugu

#Skanda:సెకండ్ ట్రైలర్ లో ఏపీ సీఎం పై సెటైర్స్? ఆ డైలాగ్స్ ఇవేనా?

మందు పొయ్యాలి..గట్టిగా అరిస్తే జైల్లో తొయ్యాలి...అడ్డమొస్తే వాళ్లని చంపేయాలి( లేపాలే) అని చెప్తాడు. ఈ డైలాగులు ఏపి సిఎం జగన్ ని ఉద్దేశించి అంటూ   ప్రచారం జరుగుతోంది. 

Satires on AP CM In #Skanda Release Trailer jsp
Author
First Published Sep 25, 2023, 7:03 AM IST

రామ్ పోతినేని- శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కు రెడీ అయ్యిన మాస్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'స్కంద'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే  ఈ సినిమా నుంచి ఓ  ట్రైలర్‌ చేసారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా స్దాయికి తగ్గ బజ్ అయితే లేదు. ఈ నేపధ్యంలో ఈ రోజు మరో ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్‌లో రామ్‌ చెప్పే పంచ్‌ డైలాగ్‌లు 'ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తొయ్యాలే.. అడ్డమొస్తే లేపాలే' ని మరోసారి రిపీట్ చేయనున్నారు. అయితే ఆ డైలాగులు సీఎం జగన్ పై  సెటైర్ గా వేసారని మీడియా టాక్.

ఇప్పటికే  బిగ్ బాస్ లో ఈ ట్రైలర్ చూపించారు.ఇక ఈ ట్రైలర్ hotstar లో కొత్త  ఎపిసోడ్ లో 58 నిముషాల దగ్గర ఉంది.  ఈ ట్రైలర్ లో ఓ క్లాస్ లో లెక్చరర్ ...రామ్ ను నువ్వేం కావాలనకుంటున్నావ్ అని అడుగుతాడు. సీఎం అని రామ్ చెప్తాడు. రీజన్ ఏంటని లెక్చరర్ అడిగితే ..ఆ పోస్ట్ లో దమ్ము ఉంది సార్. ఎటెళ్లినా ట్రాఫిక్ సిగ్నల్ లొల్లి ఉండదు. నోట్లో పైప్ పెట్టి ఊదుడు ఉండదు.మన బర్తడే అయితే స్టేట్ మొత్తం మన ప్లెక్సీలు లేస్తాయి. ఇక మన పైసలు తో అన్నదానం చేస్తడు ,అన్నదానం చేస్తడు అని చెప్తుంటే ఆపి లెక్చరర్ ..అయినా ఎలా అవుతావ్ అంటాడు. దానికి రామ్ వెంటనే 'ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తొయ్యాలే.. అడ్డమొస్తే లేపాలే'అంటాడు. 

ఇయ్యాలే అంటే డబ్బులు ఇవ్వాలి, పొయ్యాలే అంటే మందు పొయ్యాలి..గట్టిగా అరిస్తే జైల్లో తొయ్యాలి...అడ్డమొస్తే వాళ్లని చంపేయాలి( లేపాలే) అని చెప్తాడు. ఈ డైలాగులు ఏపి సిఎం జగన్ ని ఉద్దేశించి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం గతంలోనూ లెజండ్,సరైనోడు వంటి చిత్రాల్లో బోయపాటి శ్రీను..ఏపీ సీఎం జగన్ కు వ్యతికేరకంగా సీన్స్, డైలాగ్స్ వేస్తు రావటమే అంటున్నారు. అయితే ఈ డైలాగు ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సినేరియాకు సరిగ్గా సరిపోతుంది. అందరు రాజకీయనాయకులు చేసేది ఇదే,ప్రత్యేకంగా ఒకరిని ఉద్దేశించి అనుకోవటం అనవసరం.

రామ్‌పై బోయపాటి శ్రీను చిత్రీకరించిన యాక్షన్‌ సీక్వెన్స్‌లు మెప్పిస్తాయి. రామ్‌ను పక్కా మాస్‌ లుక్‌లో బోయపాటి చూపించాడు. ఇందులోని యాక్షన్‌ సీన్స్‌ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇందులో రామ్‌ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు.    ట్రైలర్ చూస్తూంటే హీరో రామ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌లో చూపించాడు బోయ‌పాటి అని అర్దమవుతోంది. ఆడియన్స్  అంచ‌నాల‌కు మించి ఈ సినిమా ఉంటుంద‌ని అర్థం అవుతోంది. బోయ‌పాటి మార్క్ యాక్ష‌న్ సీన్స్‌, రామ్ డైలాగ్‌లు విజిల్స్ వేయించేలా ఉన్నాయి.   శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ (Thaman) సంగీతాన్ని అందిస్తున్నారు.  తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ బాష‌ల్లో ఈ సినిమా సెప్టెంబ‌ర్  28 న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  

రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ రెండో  హీరోయిన్ . శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన తారాగణం.  బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 'స్కంద' చిత్రానికి కూర్పు : తమ్మిరాజు, ఛాయాగ్రహణం : సంతోష్ డిటాకే, సమర్పణ : జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం : ఎస్ తమన్, నిర్మాత : శ్రీనివాస చిట్టూరి, రచన - దర్శకత్వం : బోయపాటి శ్రీను.
  

Follow Us:
Download App:
  • android
  • ios