సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రానికి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మూవీలో చైల్డ్ రోల్ లో మహేశ్ బాబు రిలేటీవ్ నటించనున్నాడు.
‘గీత గోవిందం’ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందకు రావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. గత ఏడాది ఆరంభంలో ఈ సినిమా ను ప్రకటించిన యూనిట్ సభ్యులు కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా పట్టాలెక్కించారు. ఎట్టకేళలకు మే 12న ఈ మూవీని ప్రేక్షకుల ముుందుకు తీసుకు రానున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తీ సురేష్ చేస్తున్నారు. బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్ డ్రామాయే ఈ చిత్రం అని, ఓ బ్యాంకు మేనేజర్ కొడుకుగా మహేశ్ కనిపించనున్నారు.
అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే’ మూవీలో చైల్డ్ రోల్ కు మహేశ్ బాబు కొడుకు ‘గౌతం కృష్ణ’ను ఎంపిక చేసి ఆడియెన్స్ ను షాక్ కు గురిచేశారు డైరెక్టర్ సుకుమార్. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’లోనూ మహేశ్ బాబు చైల్డ్ రోల్ కు సుధీర్ బాబు-ప్రియదర్శిని కొడుకు దర్శన్ ను ఎంపికచేశారట పరశురామ్ పెట్ల. అయితే సుధీర్ బాబు కొడుకును తొలిసారిగా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఇప్పటికే మంచి రెస్పాన్స్ ను సొంత చేసుకున్న ‘సర్కారు వారి పాట’ నుంచి రేపు క్రేజీ అప్డేట్ రానుంది.
