Asianet News TeluguAsianet News Telugu

‘సర్కారు వారి పాట’ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట సినిమా షూటింగ్  మొదలు పెడుతున్నారు. ఇప్పటికే దుబాయ్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు తిరిగి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మహేష్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని మొదటినుంచి వినిపిస్తున్న టాక్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

Sarkaru Vaari Paatas first look on August 9! Jsp
Author
Hyderabad, First Published Jul 17, 2021, 7:06 AM IST

మూడు నెలలుగా ఆగిన షూటింగ్ లు మళ్లీ పట్టాలు ఎక్కుతున్నాయి. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూట్ కూడా మొదలైంది. ఇప్పటికే 40 రోజుల షూటింగ్ పూర్తి చేసుకొంది.  కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ షూటింగులు మొదలెట్టారు నిర్మాతలు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మహేష్ బాబు షూట్ లో పాల్గొంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నేపద్యంలోనే ఈ చిత్రం ప్రమోషన్స్ మొదలెట్టాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా ఫస్ట్ లుక్ ప్లాన్ చేసారు.

అందుతున్న సమాచారం మేరకు ఆగస్ట్ 9న  ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. ఆ రోజు మహేష్ బాబు తన 46 వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ లోగా టైటిల్ పోస్టర్ విడుదల చేస్తారు.   కరోనా కారణంగా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతున్నా కూడా అనుకున్న తేదీకి అంటే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల మాత్రం పక్కా అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఈ సినిమాలో మహేశ్‌ మాస్‌ లుక్‌లో ఆకట్టుకోబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో ..చెవి పోగుతో మెడపై రూపాయి టాటూతో సరికొత్తగా కనిపించారు. ‘హ్యాట్రిక్‌ కోసం బ్లాక్‌బస్టర్‌ ఆరంభం’ అని పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  సర్కారువారి పాట తాజా షెడ్యూల్ ను ‘వైజాగ్’లో ప్లాన్ చేశారట. మహేశ్ బాబు తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారని అంటున్నారు. 

  బ్యాంకింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భారత బ్యాంకింగ్‌ రంగంలోని కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుందని సమాచారం. కాగా మ‌హేశ్‌బాబు సరసన కీర్తీ సురేశ్‌  మొదటిసారి నటిస్తున్నారు. ఇక వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలో కనిపించన్నారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌. 
  

Follow Us:
Download App:
  • android
  • ios