Asianet News TeluguAsianet News Telugu

SVP Collections : వరల్డ్ వైడ్ ఫాస్టెస్ట్ గ్రాస్, షేర్ వసూళ్లలో ‘సర్కారు వారి పాట’ ఆల్ టైమ్ రికార్డ్..

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ మూవీ థియేట్రికల్ రన్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన SVP తాజాగా మరో రికార్డును క్రియేట్ చేసింది.
 

Sarkaru Vaari Paata which created an All time record at the world box office, Revenue details
Author
Hyderabad, First Published May 17, 2022, 4:45 PM IST

దర్శకుడు పరుశురాం పెట్ల, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన Sarkaru Vaari Paata థియేట్రికల్ రన్ ఫస్ట్ వీకెండ్ ముగిసే సరిగా జోరుగా ఉంది. యూఎస్ తోపాటు ఏపీ, హైదరాబాద్ లో ఈ చిత్రం గట్టిగానే వసూళ్లను రాబడుతోంది. మే 12న  ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైందీ చిత్రం. కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. సినిమా రిలీజ్ అయిన తొలిరోజు మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినా ఆ ప్రభావం ఏమీ కలెక్షన్లపై పడలేదనే చెప్పాలి. 

ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ఏ, ఓవర్సీస్ లో మొత్తంగా 2 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లతో  దూసుకుపోతోంది. తొలి రెండు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ల వసూళ్లతో ‘సర్కారు వారి పాట’ రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్ టైనర్  కలెక్షన్ల పరంగా మారో రికార్డున క్రియేట్ చేసినట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే ఫాస్టెస్ట్ గ్రాసింగ్ తో కొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది ‘సర్కారు వారి పాట’.

చిత్ర యూనిట్ ప్రకటించిన కలెక్లన్ల ప్రకారం.. సర్కారు వారి పాట తక్కువ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల షేర్ ను సాధించినట్టు తెలిపారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అతి తర్వగా రూ.160 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. దీంతో రీజినల్ ఫీల్మ్ గా టీఎఫ్ఐలో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిందీ చిత్రం.  కరోనా తర్వాత ఈ చిత్రం ఇంతలా వసూళ్లను రాబట్టడం గొప్ప విషయమేనని చెప్పాలి. సెకండ్ వీకెండ్ పూర్తయ్యే సరికి సర్కారు  వారి పాట లాభాల బాటలో పడనున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు, ఐదో రోజు పూర్తయ్యే సరికి తెలుగు రాష్ట్రాల్లో షేర్, గ్రాస్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ.27.47 కోట్ల షేర్ తో రూ.41.5 కోట్ల గ్రాస్ రాబ్టంది. సీడెడ్ లో రూ.8.75 కోట్ల షేర్ తో రూ.12.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక వైజాగ్ లో రూ.9.10 కోట్లు, ఈస్ట్ రూ.5.95 కోట్లు, వెస్ట్ రూ.4.45 కోట్లు, క్రిష్ణ రూ.4.38 కోట్లు, గుంటూరు రూ.5.92 కోట్లు, నెల్లూరులో రూ.2.53 కోట్ల షేర్ వసూల్ చేసింది. ఆంధ్రలో మొత్తం రూ.32.33 కోట్ల షేర్ తో రూ.48.9 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో నైజాం మరియు ఆంధ్ర ప్రదేశ్ లో రూ.68.55 కోట్ల షేర్, రూ.102.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా తాజా నివేదికలు తెలుపుతున్నాయి. 

ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా మహేశ్ బాబు, కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించారు. దర్శకుడు పరుశురామ్ పెట్ల టేకింగ్ అదుర్స్ అనిపించింది. మైత్రీ మూవీ మేకర్స్, GMBఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలోని పలు కీలక పాత్రలను  నదియా, సముద్రఖని, నాగబాబు, బ్రహ్మాజీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్  పోషించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios