‘సర్కారు వారి పాట’ నుంచి రిలీజ్ అయిన పవర్ ఫుల్ మాస్ ట్రైలర్  ప్రస్తుతం య్యూటూబ్ ను షేక్ చేస్తోంది. మిలియన్ల వ్యూస్ తో ట్రైలర్ దూసుకుపోతోంది. ట్రైలర్ వచ్చిన కొద్దిసేపటికే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించి ట్రెండ్ అవుతోంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకుడు పరుశురామ్ పెట్ల కాంబినేషన్ లో వస్తున్న మాస్ అండ్ యాక్షన్ డ్రామా ‘సర్కారు వారి పాట’. చివరిగా మహేశ్ బాబు డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఆడియెన్స్ ను, తన అభిమానులను అలరించాడు. రెండేండ్ల తర్వాత మళ్లీ Sarkaru Vaari Paataతో థియేటర్లలో సందడి చేయనున్నారు.

నిన్న ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అయితే ట్రైలర్ లో మహేశ్ ఊరమాస్ గా కనిపిస్తున్నారు. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ బాబు ఫుల్ మాస్ వైబ్స్ తో నటిస్తున్న చిత్రం ఇదే. దీనితో సర్కారు వారి పాటపై మంచి అంచనాలు ఉన్నాయి. మే 2న చిత్ర యూనిట్ హైదరాబాద్ కూకట్ పల్లి లోని భ్రమరాంబ 70 ఎంఎం థియేటర్ లో ట్రైలర్ ను లాంచ్ చేసింది. మహేష్ బాబు ట్రైలర్ లో డైలాగ్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ తో అదరగొట్టేస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

అయితే ట్రైలర్ ను మేకర్స్ నిన్న సాయంత్రం 4 : 00 గంటలకు రిలీజ్ చేశారు. ట్రైలర్ య్యూటూబ్ లో విడుదలైన గంటలోపే 10 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకొని ఫాస్టెస్ట్ వ్యూస్ సాధించిన ట్రైలర్ గా రికార్డు క్రియేట్ అయ్యింది. మరోవైపు ఇంకా 24 గంటలు పూర్తవ్వక ముందే దాదాపు 25 మిలియన్ల వ్యూస్ ను తక్కువ సమయంలో దక్కించుకుంది. అంతేకాకుండా ఈ ట్రైలర్ ప్రస్తుతం య్యూటూబ్ లో #1గా ట్రెండింగ్ అవుతోంది. అలాగే 10 మిలియన్ల లైక్స్ ను కూడా అతి తక్కువ సమయంలో సాధించింది. గత రికార్డులను బ్రేక్ చేసే విధంగా ట్రైలర్ దూసుకుపోతోంది. 

ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఆడిపాడింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Scroll to load tweet…