సూపర్  స్టార్ మహేశ్ బాబు నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం కోసం మహేశ్ బాబు ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతగానో ఎదరుచూస్తున్నారు. అయితే ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావడం లేదు. దీనిపై దర్శకుడు పరుశురాం ఇలా స్పందించాడు. 

ప్రస్తుతం సౌత్ నుంచి హీరోలంతా పాన్ ఇండియన్ మూవీ రేసులో పరిగెడుతున్నారు. ఇప్పటికే బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి భారీ చిత్రాలతో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, యష్ పాన్ ఇండియా హీరోలుగా ముద్ర వేసుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)కు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినా మహేశ్ నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయకపోవడం పట్ల అభిమానులు కొంత అప్సెట్ అవుతున్నారు. కేవలం తెలుగు సినిమాగానే విడుదలవుతుండటంతో వారికి నచ్చట్లేదు.

తాజాగా చిత్ర నిర్మాతలు, దర్శకుడు పరుశురాం పెట్ల ఈ విషయం పట్ల స్పందిస్తూ Sarkaru Vaari Paata చిత్రాన్ని ఎందుకు పాన్ ఇండియా సినిమాగా రిలీచేయడం లేదో వివరించారు. సినిమా ప్రారంభానికి ముందే తెలుగు ఆడియెన్స్ కోసమే స్క్రిప్ట్ రెడీ చేసినట్టు తెలిపారు. సర్కారు వారి పాట యూనివర్సల్ కాన్సెప్ట్ కాదని, అంతేకాకుండా సినిమాలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు లోకల్ గా కనెక్ట్ అయి ఉంటాయని తెలిపారు. దీంతో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తే అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉండదంటూ పేర్కొన్నారు. అయితే తమిళనాడు, ఇతర ప్రాంతాల నుంచి డబ్డ్ వెర్షన్ కోరినా.. కేవలం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తోనే రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. 

మరోవైపు సర్కారు వారి పాట మాసీవ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. మహేశ్ బాబు మరోసారి మాసిజాన్ని చూపించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ట్రైలర్ కు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. అలాగే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దుమ్ములేపుతోంది. ఏపీ, తెలంగాణలో ఇప్పటికే రూ.100 కోట్ల ప్రీ సేల్ జరిగింది. మిగితా ఏరియాల్లో, ఓవర్సీస్ లో రూ.25 కోట్లతో మొత్తం రూ.125 కోట్ల బిజినెస్ అయ్యింది. దీంతో సర్కారు వారి పాట ఓపెనింగ్ బాక్సాఫీసు వద్ద ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఉంది. 

దర్శకుడు పరుశురాం పెట్ల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మహేశ్ బాబు బ్యాంక్ రికవరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. నటుడు స‌ముద్ర‌ఖ‌ని విల‌న్ గా క‌నిపించ‌నున్నాడు. థమ‌న్ సంగీతం అందించాడు. ఇప్ప‌టికే పాట‌ల‌న్నీ హిట్టు కాగా, తెర‌పై ఆ పాట‌లు ఇంకా బాగుంటాయ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. అలాగే ఓ రేంజ్లో బుకింగ్స్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, మహేష్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించింది. మే 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.