సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. రేపు రిలీజ్ కావాల్సిన ఈ సాంగ్ ను ఒక్కరోజు ముందే వదలడంతో ఫాన్స్ ఖుషీ అవుతున్నారు.  

‘గీత గోవిందం’ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మే 12న ఈ మూవీని ప్రేక్షకుల ముుందుకు తీసుకు రానున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తీ సురేష్‌ చేస్తున్నారు. బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్‌ డ్రామాయే ఈ చిత్రం అని, ఓ బ్యాంకు మేనేజర్‌ కొడుకుగా మహేశ్‌ కనిపించనున్నారు.

ఈ మూవీ రిలీజ్ కన్నా.. ఫస్ట్ సింగిల్ పట్ల అభిమానులు చాలా ఇంట్రెస్ట్ చూపారు. దాదాపు 16 రోజులు నుంచి ఎదురు చూస్తున్న మహేశ్ అభిమానులు ఇప్పుడు పండగే. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’నుంచి రోమాంటిక్ సాంగ్ ‘కళావతి’ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఒక్క రోజు ముందే ‘వాలెంటైన్స్ ఒక్క రోజు ముందుగానే’ అంటూ ఈ సాంగ్ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో మహేశ్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. మరోవైపు సాంగ్ రిలీజైన కొద్ది నిమిషాల్లో 50 వేల వ్యూస్ ను దక్కించుకుంది.

Scroll to load tweet…

‘కళావతి’ సాంగ్ కు సంగీ దర్శకుడు ఎస్ థమన్ మంచి ట్యూన్ అందించగా, లవ్ సాంగ్స్ ప్రొఫెషనల్, స్టార్ సింగర్ సిద్ధ్ శ్రీ రామ్ గాత్రం అందించారు. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ రోమాంటిక్ లిరిక్స్ సమకూర్చారు. ఈ మ్యూజిక్ వీడియోలో ‘మాంగళ్యం తంతునామేనా’ శ్లోకంతో ప్రారంభమవుతుంది.. 

వందో ఒక వేయ్యో.. ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా.. ఏందే నీ మాయా.. ఉందో.. అటు పక్కో.. ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా.. పోయిందే సోయా.. ఇట్టాంటివన్నీ అలవాటే లేదు.. అట్టాంటీ నాకీ తడబాటసలేందే.. కమాన్.. కమాన్ కళావతి.. నువ్వు లేకనేను.. నువ్వు లేకుంటే అధోగతి’ అంటూ సాగిన పాట ఆసాంతం ఆసక్తిగా, వినసొంపుగా ఉంది. మరోవైపు ఈ మ్యూజిక్ వీడియో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ( Thaman), సింగర్ సిద్ధ్ శ్రీ రామ్ (Sid Sri Ram) పంచెలు ధరించి సాంగ్ ను కంపోజ్ చేస్తూ.. పాడుతూ కనిపించారు. ఇక మహేశ్ బాబు, కీర్తి సురేశ్ కెమిస్ట్రీ చాలా బాగుంది. వీడియో మొత్తం క్లాస్ లుక్ తో ఆకట్టుకుంటోంది.