యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా `సర్కార్2` పేరుతో గేమ్ షోని లాంచ్ చేయబోతుంది. `సర్కార్` ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో సరికొత్త సీజన్‌తో శుక్రవారం ఏప్రిల్ 29 నుంచి ఆడియన్స్ కి సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
తెలుగు ఓటీటీ డిజిటల్ సంస్థ `ఆహా` విజయవంతంగా రన్ అవుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోస్ నిర్మిస్తూ దూసుకుపోతుంది. అందులో భాగంగా టాక్ షోలు బాగా పాపులర్ అయ్యాయి. సమంత హోస్ట్ గా చేసిన `సామ్‌జామ్`, బాలకృష్ణ హోస్ట్ గా చేసిన `అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోలు విశేష ఆదరణ పొందాయి. తాజాగా మరో షో రాబోతుంది. యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా `సర్కార్2` పేరుతో గేమ్ షోని లాంచ్ చేయబోతుంది.
`సర్కార్` ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో సరికొత్త సీజన్‌తో శుక్రవారం ఏప్రిల్ 29 నుంచి ఆడియన్స్ కి సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కానుంది. `ఆహా`లో `సర్కార్` గేమ్ షో. సీజన్ 1కి వచ్చిన మెరుపు రెస్పాన్స్ కి, మరింత జిగేల్‌మనిపించే హంగులతో సెకండ్ సీజన్ సిద్ధమైంది. అగస్త్య ఆర్ట్స్ నిర్మించిన గేమ్ షో ఇది. ప్రదీప్ మాచిరాజు షోని హోస్ట్ చేస్తున్నారు. వ్యూయర్స్ కి స్టెల్లార్ సర్‌ప్రైజ్‌లు ఈ షోలో సిద్ధంగా ఉన్నాయి.
రెట్టించిన థ్రిల్, రెట్టించిన ఎగ్జయిట్‌మెంట్, రెట్టించిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో `సర్కార్ 2` రియాలిటీ షో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడానికి సిద్ధమైంది. ఇందులోని బిడ్డింగ్ గేమ్స్ లో స్పెషల్ గెస్టులు క్వశ్చన్స్ ని గెస్ చేసే అవకాశం ఉంది. ప్రతి ఎపిసోడ్‌లోనూ నాలుగు రౌండులంటాయి. సీటు అంచున కూర్చునే వినోదాన్ని ప్రేక్షకులకు షేర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సీజన్‌ని డిజైన్ చేశారు మేకర్స్.
వెరీ ఫస్ట్ ఎపిసోడ్‌లో రెగ్యులర్ ఎంటర్ టైన్‌మెంట్‌తో పాటు ఎక్స్ ట్రా వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది టీమ్. `డీజే టిల్లు` ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, మార్కస్ ఫేమ్ ప్రణీత్ రెడ్డి, మురళీధర్, దీపిక పిల్లి సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ విడుదలైన ఆహా సర్కార్ సీజన్ 2 ప్రోమోకి ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వస్తోంది.
`సర్కార్` ప్రతి ఎపిసోడ్‌లోనూ నాలుగు లెవల్స్ ఉంటాయి. గెస్ట్ లు కూడా ప్రతి లెవల్లోనూ క్వశ్చన్స్ ని గెస్ చేయవచ్చు. నాలుగు రౌండ్లలోనూ గెలుపొందిన ఫైనల్ పార్టిసిపెంట్‌కి చివరికి సర్కార్ ప్రదీప్ మాచిరాజుతో ఆడే అవకాశం వస్తుంది. ఈ సీజన్‌లో లైవ్ ఆడియన్స్ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ప్రదీప్ మాచిరాజు ఇందులో స్టాండప్ కామెడీ కూడా చేస్తారు. దాంతో పాటు ఆడియన్స్ ని కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఆడియన్స్ లో నుంచి విన్ అయిన లక్కీ పర్సన్‌కి సర్కార్ టీమ్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఉంటుంది. ఆడియన్స్ ని అడిగే ప్రశ్నల్లో జనరల్ నాలెడ్జ్, పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, పాలిటిక్స్, స్పోర్ట్స్, మైథాలజీ, మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక `ఆహా`లో అన్‌లిమెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అంటున్నారు నిర్వహకులు.
