మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఇంట్రడక్షన్ టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు దర్శకుడు అనిల్ విజయశాంతికి సంబందించిన మరో ఫోటోని రిలీజ్ చేశాడు. 

దాదాపు 13 ఏళ్ల తరువాత విజయశాంతి మేకప్ వేసుకున్నట్లు చెబుతూ.. ఈ 13 ఏళ్లలో ఆమెలో ఏ మాత్రం మార్పు రాలేదని, సేమ్ డిసిప్లేన్ - సేమ్ ఆటిట్యూడ్ అని పేర్కొన్నారు. అలాగే ఆమె చైతన్యంలో కూడా ఎలాంటి తేడా కనిపించలేదని సరిలేరు నీకెవ్వరు టీమ్ లోకి ఆమెను ఆనందంగా ఆహ్వానిస్తున్నట్లు దర్శకుడు తెలియజేశాడు. సూపర్ స్టార్ అభిమానులు విజయశాంతి పోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. 

ఆమెకు సంబందించిన స్టిల్ ను విడుదల చేయాలనీ మహేష్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ తో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ సినిమా షూటింగ్ మొత్తాన్ని డిసెంబర్ లోగా ఫినిష్ చేయాలనీ టార్గెట్ గా పెట్టుకుంది. అనిల్ సుంకర - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ను సంక్రాంతికి రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.