సుస్వరాల వేదిక మన జీ తెలుగు స రి గ మ ప. ఎందరో గాయనీ గాయకులని పరిచయం చేసి తనదైన పేరును సంపాదించుకుంది స రి గ మ ప. ఎన్నో వారాలనుంచి అందరిని అలరిస్తున్న 13 వ సీజన్ కంటెన్స్టెంట్స్ త్వరలో సెమీఫైనల్స్ కు అడుగుపెడుతున్నారు. వారిని ఉత్తేజపరచడానికి ఈ వారం మెంటర్స్ కొన్ని అద్భుతమైన పాటలు పాడి వారిని ప్రోత్సహించనున్నారు. మెంటర్స్ పృథ్వి, దీపు, రేవంత్, సాకేత్, సోనీ, రఘురామ్, హరిక మరియు దామిని సరికొత్త పాటలు పాడి ప్రేక్షకుల్ని రంజింపచేయనున్నారు. పాటలే కాకుండా, ఎన్నో సరికొత్త విషయాలు ఈ వారం మెంటర్స్ గురించి ఛానల్ చూపించనుంది. 

సింగర్ దీపు, తన ప్రేమాయణం అందరికి చెప్పబోతున్నాడు. ఇది ఇలా ఉంటే, దీపు భార్య తనతో పాటు వేదిక పంచుకొని దీపుని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలాగే, రేవంత్ తన బ్రేక్అప్ స్టోరీ తో పాటు, సాకేత్ మరియు తనకి ఉన్న స్నేహం, తన జర్నీ గురించి అందరికి వివరిస్తాడు. ఈ వారం మెంటర్స్ కి సంబంధించిన ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నం జీ తెలుగు స రి గ మ ప వేదిక పైన. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, ఈ ఆదివారం రాత్రి 8 గంటలకు తప్పక చూడండి 

స రి గ మ ప 13 వ సీజన్ , మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లలో ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.జీ తెలుగు గురించిజీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు. 

2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు. ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది. విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.. అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు. అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది. ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.