Asianet News TeluguAsianet News Telugu

ముంబయ్ లోకల్ ట్రైన్ లో సందడి చేసిన సారా అలీఖాన్

సాధారణంగా సెలబ్రిటీలు అంటే లగ్జరీ కార్లలో ప్రయణిస్తుంటారు. సొంత కార్లు, సొంత హెలికాప్టర్లు ఉన్న స్టార్లను కూడా మనం చూశాం. కాని సినిమా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న సారా అలీఖాన్ మాత్రం లోకల్ ట్రైన్ లో సమాన్యురాలి మాదిరిగా ప్రయాణించి ఆశ్చర్యపరిచింది. 

Sara Ali Khan Travel in Mumbai Local Train
Author
First Published Dec 10, 2022, 5:41 PM IST

సాధారణంగా సెలబ్రిటీలు అంటే లగ్జరీ కార్లలో ప్రయణిస్తుంటారు. సొంత కార్లు, సొంత హెలికాప్టర్లు ఉన్న స్టార్లను కూడా మనం చూశాం. కాని సినిమా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న సారా అలీఖాన్ మాత్రం లోకల్ ట్రైన్ లో సమాన్యురాలి మాదిరిగా ప్రయాణించి ఆశ్చర్యపరిచింది. 

స్టార్ డమ్ ఉంటే బయట కనిపింకూడదు.. జనాల్లో కలవకూడదు.. రోడ్డు మీద ఉండకూడదు అంటూ సవా లక్ష్యా రిస్ట్రెక్షన్స్ పెట్టుకుంటుంటారు. సినిమావాళ్లు బయటకు వస్తే చాలు... అంతే సంగతులు. కాని కొంత మంది స్టార్లు మాత్రం అప్పుడప్పుడు జనాల్లో కలవడానికి చూస్తుంటారు. జాగ్రత్తగా ఉంటూనే.. కామన్ ఆడియన్స్ లా తిరగాలని ఆశపడుతుంటారు. 

స్టార్‌డమ్‌ ఉన్న వారు కూడా చాలా మంది సాధారణంగా బస్సుల్లో, రైళ్లలో, ఆటోల్లో ప్రయాణించడం అరుదుగా చూస్తుంటాం. లగ్జరీ వాహనాల్లోనే ప్రయాణించే వారు.. కొన్ని సార్లు సాధారణ ప్రజల్లా లోకల్‌ వాహనాల్లో ప్రయాణిస్తారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్  సారా అలీఖాన్‌ ముంబయి లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించి సందడి చేసింది. లొకల్ ట్రైన్ లో ప్రయాణించిన సారా అలీఖాన్ దానికి  సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 

 

అయితే టైమ్ ను సేవ్ చేయడం కోసమే సారా అలీఖాన్ తన టీమ్ తో కలిసి లోకల్ ట్రైన్ లో  ప్రయాణం చేసినట్టు తెలుస్తోంది. కార్ లో వెళ్తే ట్రైన్‌ దిగిన అనంతరం కూడా సారా ఆటోలో ప్రయాణం కొనసాగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios