బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ తన వ్యక్తిత్వంతో నెటిజన్ల మనసులు దోచుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ షోలో తనకు నటుడు కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ చేయాలనుందని చెప్పింది సారా. ఆ తరువాత వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తుండడంతో సన్నిహితంగా మెలుగుతున్నారు.

ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. వీరిద్దరూ పలు సందర్భాల్లో జంటగా మీడియాకంట పడడంతో ఇద్దరి మధ్య రిలేషన్ ఉందనే మాటలకు మరింత బలం చేకూరింది. కాగా కార్తిక్ ను కలవడానికి సారా లఖ్‌నవూ వెళ్లారు. ఈ క్రమంలో తన మొత్తం లగేజీని తనే తోసుకుంటూ వెళ్లారు.

చాలా తక్కువ మంది సెలబ్రిటీలు ఎయిర్ పోర్ట్ లలో తమ లగేజీను తమే తీసుకెళ్తుంటారు. దీంతో సారాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. సారా డౌన్ టు ఎర్త్ అని, ఓ స్టార్ లా ఆమె వ్యవహరించడం లేదని.. సామాన్య వ్యక్తిలా ఆమె ప్రవర్తించడం గొప్ప విషయమని.. నిజంగానే ఆమె స్టార్ హీరో కుమార్తేనా..? గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు.

'కేదార్‌నాథ్‌‌‌' సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన సారా ఆ తరువాత 'సింబా' సినిమాలో నటించి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.