Asianet News TeluguAsianet News Telugu

కరణ్ జోహార్ షోలో సారా అలీఖాన్.. స్టార్ కిడ్ గురించి ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ తాజాగా బాలీవుడ్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 8కు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం యంగ్ బ్యూటీ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. 
 

Sara Ali Khan attended Koffee with Karan season 8 with Ananya Panday NSK
Author
First Published Nov 10, 2023, 12:26 PM IST

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్ (Sara Ali Khan)  ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ యంగ్ బ్యూటీ మరో కుర్ర భామ అనన్య పాండే (Ananya Panday) తో కలిసి కరణ్ జోహార్ షోకు హాజరైంది. ఈ సందర్భంగా తన మాటలతో ఆకట్టుకుంది. తను ఎప్పుడూ సెల్ప్ గా ఎదిగేందుకు ప్రయత్నిన్నానని షోలో చెప్పుకొచ్చింది. 

అందుకే ఎప్పుడూ ఆమె టూర్స్, ట్రావెలింగ్ చేస్తూ ఉంటానని తెలిపింది. దూర ప్రాంతాలకు వెళ్లడం తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. అలాగే పుస్తకాలు చదవడం,  వ్యక్తిత్వాన్ని పెంపొందించడం వంటి అభిరుచులపై ఎక్కువ దృష్టి సారిస్తానని తెలిపింది. ఇక సారా అలీఖాన్ తల్లిదండ్రులు సైఫ్ అలీఖాన్  - అమృతా సింగ్ విడిపోయినప్పటికీ ఆమె తల్లితోనే ఎక్కువగా పెరిగింది. స్టార్ కిడ్ అయినప్పటికీ రిచ్ లైఫ్ కంటే సాధారణంగా ఉండేందుకే ఇష్టపడుతుంటుంది.  ఇక షోలోనూ తను మాట్లాడిన తీరు ఆసక్తికరంగా మారింది. 

నెపోటిజం వంటి అంశాలపైనా ఇతర స్టార్స్ కు కంటే చక్కగా స్పందిస్తోంది. తను కూడా సొంతంగా బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంటుంటోంది. సినిమాలు, వ్యక్తిగత విషయాల పట్ల మరింత ఉన్నతంగా మారేందుకు ప్రయత్నిస్తుంది. ఇక షోలో తను రెడ్ స్లీవ్ లెస్ డ్రెస్ లో ఆకర్షణీయంగా మెరిసింది. ఇక సారా రవీంద్రనాథ్ ఠాగూర్ వంశానికి చెందినది షోలో చెప్పుకొచ్చింది. ఆమె తాతగారు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, తండ్రి సైఫ్ అలీ ఖాన్ ఇద్దరూ వించెస్టర్ కాలేజీలో చదువుకోవడం విశేషం. సారా కూడా కొలంబియా యూనివర్సిటీ నుండి పట్టభద్రురాలైంది. ప్రస్తుతం హిందీలో ‘ఏ వతన్ మేరే వతన్’, ’మెట్రో... డినోలో’, ‘ముబారక్ హత్య’ చిత్రాల్లో నటిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios