టాలీవుడ్‌ లో మంచి విజయం సాధించిన 'టెంపర్' సినిమాను బాలీవుడ్ లో 'సింబా' పేరిట రణ్‌ వీర్‌ సింగ్‌ తో రోహిత్ శెట్టి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కరణ్ జోహర్ నిర్మాత కావడంతో బాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. సోషల్ మీడియా సంచలనం ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాలో నటించనుందంటూ గతంలో పలు కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. 

వీటన్నింటినీ రూమర్స్ గా కొట్టిపడేసిన చిత్రయూనిట్ ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ ను ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఈ మేరకు రోహిత్‌ శెట్టి, కరణ్‌ జోహార్‌ లు ఆమెతో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కాగా, సారా అలీఖాన్ ‘కేదార్‌ నాథ్‌’ సినిమాతో బాలీవుడ్‌ అరంగేట్రం చేయనుంది.