Asianet News TeluguAsianet News Telugu

సూపర్‌స్టార్‌ కృష్ణ ఆవిష్కరించిన సప్తగిరి `గూడుపుఠాణి` ఫస్ట్ లుక్‌

`సప్తగిరి ఎక్స్ ప్రెస్‌`, `సప్తగిరి ఎల్‌ఎల్‌బి` చిత్రాలతో హీరోగా మెప్పించిన సప్తగిరి ఇప్పుడు మరో సినిమాతో హీరోగా రాబోతున్నారు. `గూడుపుఠాణి` సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

sapthagiri starrer gooduputani first look released by superstar krishna  arj
Author
Hyderabad, First Published Jul 4, 2021, 12:32 PM IST

`సప్తగిరి ఎక్స్ ప్రెస్‌`, `సప్తగిరి ఎల్‌ఎల్‌బి` చిత్రాలతో హీరోగా మెప్పించిన సప్తగిరి ఇప్పుడు మరో సినిమాతో హీరోగా రాబోతున్నారు. `గూడుపుఠాణి` సినిమాలో హీరోగా నటిస్తున్నారు. నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తుంది. కుమార్‌ కె.ఎం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్ పతాకంపై రియల్‌ ఎస్టేట్‌ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, కటారి రమేష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఆదివారం ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని సూపర్‌స్టార్‌ కృష్ణ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా హీరో సప్తిగిరి మాట్లాడుతూ, `
సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన `గూడుపుఠాణి` సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. అదే టైటిల్ తో నేను సినిమా చేయడం విశేషం. కృష్ణ గారు మా సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. దర్శకుడు కుమార్ కె.ఎం ఆసక్తికరంగా తెరకెక్కించారు` అని తెలిపారు. 

నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ మాట్లాడుతూ, ``గూడుపుఠాణి` సినిమా చాలా బాగా వచ్చింది. సప్తగిరి చక్కగా నటించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది, హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మంగళూరు పరిసర అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించాం. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం సంతోషంగా ఉంద`ని తెలిపారు. దర్శకుడు కుమార్ కె. ఎం మాట్లాడుతూ,`నా మొదటి సినిమా `గూడుపుఠాణి` డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించా. ఆడియన్స్ సినిమా చూసి థ్రిల్ ఫీల్ అవుతారు. సూపర్ స్టార్ గారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది` అని తెలిపారు. 

ఈ చిత్రానికి బ్యానర్: ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్, 
నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్, 
డైరెక్షన్: కుమార్.కె.ఎం
 కెమెరామెన్: పవన్ చెన్న, 
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
మ్యూజిక్: ప్రతాప్ విద్య 

ఫైట్స్:
సోలిన్ మల్లేష్

 పీఆర్ఒ: ఫ్రీడమ్ మీడియా. 

Follow Us:
Download App:
  • android
  • ios