సంతోష్ శోభన్ ఈ సారి చిరు కుమార్తె సినిమాలో...

ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సంతోష్ శోభన్. తనునేను సినిమాతో ఎంట్రీఇచ్చిన సంతోష్ ఆతర్వాత పేపర్ బాయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Santosh Shoban to act in a Tamil remake! JSP

మెగాస్టార్ చిరు పెద్ద కూతురు సుస్మిత సిని పరిశ్రమలో చాల కాలం నుంచే జర్నీ చేస్తున్నారు. ఇప్పటికే క్యాస్టూమ్ డిజైనర్ గా చిరు చరణ్ చిత్రాలకు వర్క్ చేశారు.  ఇప్పుడు ఆమె నిర్మాతగా మారి ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే భర్త విష్ణుతో కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్’ స్థాపించిన సుస్మిత.. ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ పేరుతో  వెబ్ సిరీస్ కూడా నిర్మించారు.  ఇప్పుడిక సుస్మిత సినిమా నిర్మాణానికి కూడా రెడీ అవుతోంది. ఆమె నిర్మాణంలో రాబోయే తొలి చిత్రం ఓ తమిళ రీమేక్. 

8 తొట్ట‌క‌ల్.. త‌మిళంలో విడుదలై నాలుగేళ్ల కింద‌ట విడుద‌లై మంచి విజ‌యం సాధించిన చిన్న సినిమా. వెట్రి అనే కొత్త హీరో ఇందులో లీడ్ రోల్ చేశాడు.  ఈ చిత్రం తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా చేస్తున్నట్లు సమాచారం. సంతోష్ శోభన్  రీసెంట్ గా చేసిన ఏక్ మినీ కథ మంచి విజయం సాధించింది. దాంతో అతన్నే హీరోగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. తమిళ వెర్షన్ డైరక్ట్ చేసిన శ్రీ గ‌ణేష్ తెలుగులో కూడా చేస్తున్నారు.
 
ఇదో థ్రిల్ల‌ర్ మూవీ .ఇందులో హీరో అయిన పోలీస్.. ఒక నేర‌స్థుడిని ప‌ట్టుకునే క్ర‌మంలో త‌న రివాల్వ‌ర్ కోల్పోతాడు. దాన్ని దొంగిలించిన వ్య‌క్తి మ‌రొక‌రికి దాన్ని అమ్ముతాడు. దీంతో క‌థ అనూహ్య మ‌లుపులు తిరుగుతుంది.ఇంటెన్స్ డ్రామాతో  సాగే ఈ చిత్రాన్ని ఇప్ప‌టికే క‌న్న‌డ‌లో రీమేక్ చేయ‌గా.. అక్క‌డా హిట్ట‌యింది. ఇప్పుడు సుస్మిత ఆ సినిమా హ‌క్కులు కొనుగోలు చేసి తెలుగులోనూ ఓటీటికు చేస్తున్నట్లు సమాచారం‌.  

సంతోష్  శోభన్... పేపర్ బాయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సంతోష్ శోభన్ నటించిన ఏ మినీ కథ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఓటీటీ వేదికగా ఈ సినిమా విడుదలైంది.  ఇదే ఊపులో వరుస సినిమాలు చేసి టాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమలోనే వరసగా కొత్త సినిమాను అనౌన్స్ చేసాడు. సారంగ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా అభిషేక్ మహర్షి అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.అలాగే దర్శకుడు మారుతి డైరక్షన్ లో ఓ సినిమా జరుగుతోంది. ఇఫ్పుడీ సినిమా. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios