‘ప్రాజెక్ట్ K’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లాంటి స్టార్లు నటిస్తున్నారు. 

మహా నటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమితాబచ్చన్.. దీపికా పదుకనేతో పాటు ఇంకా ప్రముఖ స్టార్స్ కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి శరవేగంగా జరుగుతోంది. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా రూపొందబోతోన్న ఈ చిత్రం గురించిన ప్రతీ అప్డేట్ ఆసక్తికరమే. 

తాజాగా ప్రాజెక్ట్ కె సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నిర్మాత అశ్వనీదత్. "ప్రాజెక్ట్ కె సినిమాకు మిక్రీ జే మేయర్ సంగీతం అందించడం లేదు. బీజీఎమ్ తోపాటు సంగీతాన్ని స్కోర్ చేసేందుకు మేము సంతోష్ నారాయణ్ ని తీసుకున్నాం. అంతేకాకుండా ఈ సినిమా సంగీతం కోసం బాలీవుడ్ లేడీ మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా సెలెక్ట్ చేశాం. ఈ సినిమాలోని నటీనటుల గురించి త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ విషయం ఎప్పుడో తెలుసు అంటున్నారు అభిమానులు. లాస్ట్ ఇయిర్ జులైలో వైజయంతి మూవీస్ వారు ప్రాజెక్ట్ కే క్లాప్ పడింది అంటూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో క్లాప్ బోర్డ్ ను చూపించడం జరిగింది. అమితాబచ్చన్ పై ఆ షూట్ ను చేశారు. ఆ ట్వీట్ ను అప్పుడు తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ రీ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

మొదటగా ప్రాజెక్ట్ కే కు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన్నే కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. ఎందుకంటే ఆయనకు దర్శకుడు నాగ్ అశ్విన్ కు మద్య మంచి ర్యాపో ఉంది. అందుకే ఇద్దరి కాంబోలో ఈ సినిమా వస్తుందని అనుకున్నారు. ఇప్పుడు తమిళ దర్శకుడు సంతోష్ నారాయణ రీ ట్వీట్ చేశాడు అంటే ఖచ్చితంగా అతడు ఈ ప్రాజెక్ట్ లో ఎంటర్ అయ్యాడు అర్దం అయ్యింది. ఇప్పుడు అశ్వనీదత్ ఖరారు చేసారు.

 ప్రముఖ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ను ప్రభాస్ సినిమా కోసం తీసుకోవాలని అనుకుంటున్నారట. ‘కబాలి’, ‘కాలా’ వంటి సినిమాలకు సంతోష్ మ్యూజిక్ అందించారు. తమిళంలో ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాల బీజియమ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. నాని నటిస్తోన్న ‘దసరా’ సినిమాతో ఆయన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. కానీ ఇంతలోనే ప్రభాస్ సినిమా ఛాన్స్ వచ్చిందని టాక్.

"ప్రాజెక్ట్ కె షూటింగ్ 70 శాతం పూర్తయింది. మేము 5 నెలల క్రితం వీఎఫ్ఎక్స్, కంపెనీలలో గ్రాఫిక్స్ పని ప్రారంభించాం. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె త్వరలో షూటింగ్ లో పాల్గొంటారు. వారికి కేవలం 7 నుంచి 10 రోజుల షూటింగ్ మాత్రమే ఉంటంది. ప్రాజెక్ట్ కెలో ప్రభాస్ హీరో అయినా.. అమితాబ్, దీపికా పాత్రలు ఈ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్తాయి. ఈ మూడు క్యారెక్టర్లు చాలా ముఖ్యమైనవి" అని అశ్వనీదత్ తెలిపారు.