పెద్ద పండుగ నాడు సరికొత్తగా దర్శనం ఇచ్చాడు విక్టరీ వెంకటేష్. కుటుంబంతో పాటు పచ్చని పంట పొలాలలో సరదాగా గడుపుతున్న పోస్టర్ పంచుకున్నారు. వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం నారప్ప. 2019లో ధనుష్ హీరోగా దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన అసురన్ చిత్రానికి నారప్ప అధికారిక రిమేక్. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. 

నారప్ప మూవీలో వెంకటేష్ మధ్య వయస్కుడైన ముగ్గురు పిల్లల తండ్రి పాత్ర చేస్తున్నారు. పరిశ్రమలో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో వెంకటేష్ భార్య పాత్రలో ప్రియమణి నటించడం విశేషం. జాతి కుల అంతరాల మధ్య నడిచే రివేంజ్ డ్రామాగా నారప్ప తెరకెక్కుతుంది. సురేష్ బాబు మరియు కలై పులి థాను కలిసి నిర్మిస్తున్నారు. 

దీనితో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ ఎఫ్ 3 చిత్రంలో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న ఈ మూవీ 2019 సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 కి కొనసాగింపుగా వస్తుంది. హీరోయిన్స్ సైతం మొదటిపార్ట్ లో నటించిన తమన్నా, మెహ్రీన్ లను తీసుకుంటున్నారు.