2024 సంక్రాంతి కింగ్ 'దిల్ రాజు', నాలుగు రిలీజ్ లు
సక్సెస్ఫుల్ నిర్మాతగా తనదైన ప్లానింగ్ తో నెంబర్ వన్ ఎదిగిన డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు తర్వాతే ఎవరైనా అన్నట్లుగా తెలుగు పరిశ్రమలో గుర్తింపు పొందారు.

డిస్ట్రిబ్యూషన్ లెక్కలు మారుతున్నాయి. అయినా దిల్ రాజు నైజాం కింగ్ గా కొనసాగుతున్నారు. ఆ మధ్యన నైజాం ఏరియాలో తమ సినిమాలను దిల్ రాజు కి ఇవ్వడం ఇష్టం లేని చాలామంది నిర్మాతలు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ కోసం దిల్ రాజు ని సంప్రదించడానికి ఆసక్తి చూపించడం లేదు. తమ సినిమాలను తామే సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకునే ప్రయత్నం చేసారు.అయితేనేం దిల్ రాజుని దాటి వెళ్లటం వాళ్ల వల్ల కావటం లేదు. ఎందుకంటే దిల్ రాజు ఒక్కడే సరైన థియేటర్స్ లో రిలీజ్ చేయగలుగుతున్నారు. అలాగే పేమెంట్స్ విషయంలోనూ రీజనబుల్ గా ఉంటున్నారు. దాంతో మొదట వద్దనుకున్న నిర్మాతలు చాలా మంది దిల్ రాజు వైపై మ్రొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు సంక్రాంతి 2024కి రిలీజ్ కు రెడీ అవుతున్న నాలుగు సినిమాల నైజాం రైట్స్ ఆయన దగ్గరే ఉండటం విశేషం. ఆ సినిమాలు
#GunturKaaram మహేష్,త్రివిక్రమ్ కాంబినేైషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
#VD13 విజయ్ దేవరకొండ,పరుశరామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాత దిల్ రాజే.
#Saindhav విక్టరీ వెంకటేష్ హీరోగా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సైంధవ్ ..
#NaSaamiRanga ఘోస్ట్' తర్వాత గ్యాప్ తీసుకున్న అక్కినేని నాగార్జున కొత్త సినిమాతో మన ముందుకు వచ్చారు. 'నా సామి రంగ' అంటూ ఊర మాస్ మూవీతో రంగంలోకి వస్తున్నారు.
ఇప్పటికైతే ఈ నాలుగు సంక్రాంతి సినిమాలు దిల్ రాజు చేతిలో నైజాం రైట్స్ ఉన్నాయి. అందుకే నైజాం కింగ్ గా మన్నలను పొందుతున్నారు .ఇక ఈ మధ్య కాలంలో నైజాం నుండి ఈయన అందుకున్న లాభాల లిస్ట్ చూస్తే ఆశ్చర్యపోతాం. క్రితం ఏడాది నైజాం ప్రాంతంలో స్టార్ హీరోల చిత్రాలను వరుస పెట్టి కొన్నారు దిల్ రాజు.అయితే ఆ మూవీస్ ఒక్కోటిగా విడుదల అయ్యి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ను లాభాల వర్షంతో ముంచెత్తాయి.
నైజాంలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ గా కూడా పేరు తెచ్చుకున్న దిల్ రాజు క్యాలిక్యులేషన్స్ ఈమధ్య విభిన్నంగానే ఉంటున్నాయి. చాలా వరకు తాను నిర్మించిన సినిమాలను మాత్రమే నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి దిల్ రాజు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దిల్ రాజు భారీ బడ్జెట్ తో కొనుగోలు చేసిన ఆ సినిమాని కూడా అదే రేంజ్ లో ప్రమోట్ చేస్తారు. కానీ ఒకవేళ సినిమా ప్రాఫిట్స్ ని చిత్ర నిర్మాత తో పంచుకోవాలంటే మాత్రం దిల్ రాజు క్యాలిక్యులేషన్స్ వేరుగా ఉంటాయని చెప్తారు. ఏదైమైనా దిల్ రాజు ఇప్పుడు నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ లో తనకి పెరిగిపోతున్న కాంపిటీషన్ ని దాటి వెళ్లి కింగ్ అనిపించుకున్నారనే విషయం సంక్రాతి 2024 మరోసారి ప్రూవ్ చేస్తోంది.