బాలీవుడ్ ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తోన్న చిత్రం 'సంజు'. ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాకు హిట్ టాక్ వచ్చిందని సంబరపడేలోపే మేకర్స్ కు పెద్ద షాక్ తగిలింది.

ఉదయం విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉండడం షాక్ కు గురి చేసింది. అది కూడా హెచ్.డి ప్రింట్ కావడం గమనార్హం. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్ లైన్ లో కనిపించడం భారీ నష్టాలను కలిగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా లీక్ అవ్వడం పట్ల రన్ బీర్ కపూర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి లింక్ ను ఎవరికీ షేర్ చేయొద్దని కామెంట్లు పెడుతున్నారు.