మరోమారు సినిమా షూటింగ్‌ సందర్భంగా గాయ‌ప‌డిన మున్నాబాయ్ చిన్న విషయమే అంటూ పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకుని షూటింగ్‌లో పాల్గొన్న సంజయ్‌దత్‌ పక్కటెముకలు విర‌గ‌డంతో ప‌రిస్థితి తీవ్రంగా త‌యారైంద‌ట

తాజాగా మరోమారు సంజయ్‌దత్‌ 'భూమి' సినిమా షూటింగ్‌ సందర్భంగా గాయపడ్డాడు. ఈ సారి గాయం తీవ్రత చాలా ఎక్కువగా వున్నట్లు తెలుస్తోంది. గాయపడిన వెంటనే, అది చిన్న విషయమే ..' అంటూ పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకుని, సంజయ్‌దత్‌ షూటింగ్‌లో పాల్గొన్నాడు. దాంతో, పరిస్థితి మరింత తీవ్రంగా తయారైందట. పక్కటెముకలు విరిగిన దరిమిలా, షూటింగ్‌లో పాల్గొనడం అస్సలు కుదరదని వైద్యులు తేల్చేశారు

కొన్ని వారాలపాటు సంజయ్‌దత్‌ షూటింగ్‌కి దూరంగా వుండక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోపక్క, 'భూమి' సినిమాకి ఏవీ కలిసి రాకపోవడం, అన్నిటికీ మించి జైలు నుంచి బయటకొచ్చాక టైమ్‌ అస్సలేమాత్రం బాగాలేకపోవడంతో సంజయ్‌దత్‌ మానసికంగా కుంగిపోతున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో ఈ కుంగుబాటు కారణంగానే డ్రగ్స్‌ని ఆశ్రయించాడు మున్నాభాయ్‌. అలా బ్యాడ్‌ బాయ్‌ ఇమేజ్‌ తెచ్చుకుని, ఆ తర్వాత డ్రగ్స్‌ని వదిలించుకున్నాడనుకోండి.. అది వేరే విషయం