శనివారం సంజయ్‌ దత్‌ శ్వాస తీసుకోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనటంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు కరోనా సోకిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కరోనా టెస్ట్‌లో సంజయ్‌కు నెగెటివ్‌ రావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌ దత్ రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శ్వాస తీసుకోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకావటంతో ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల పాటు ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన తరువాత జనరల్‌ వార్డ్‌కు మార్చారు. అబ్జర్వేషన్ తరువాత ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదట పడటంతో ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. తమ అభిమాన నటుడు సంపూర్ణ ఆరోగ్యం తిరిగి రావటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శనివారం సంజయ్‌ దత్‌ శ్వాస తీసుకోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనటంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు కరోనా సోకిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కరోనా టెస్ట్‌లో సంజయ్‌కు నెగెటివ్‌ రావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో సంజయ్ దత్ తాను క్షేమంగా ఉన్నట్టుగా అభిమానులకు తెలిపారు.

Scroll to load tweet…

`నేను బాగానే ఉన్నాను. నా కోవిడ్ రిపోర్ట్ నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతం మెడికల్ అబ్జర్వేషన్‌లో ఉన్నాను. డాక్టర్ల పర్యవేక్షణ, నర్సులు, స్టాఫ్ కేర్‌తో ఒకటి రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోతాను` అంటూ ట్వీట్ చేశాడు. అన్నట్టుగానే సంజయ్‌ దత్‌ రెండు రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లాడు.