గతంలో ఎప్పుడు లేని విధంగా బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ ఒక డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. తెలుగు సినిమా ప్రస్థానంను ఎంతో ఇష్టపడి అదే దర్శకుడితో బాలీవుడ్ లో సేమ్ టైటిల్ తో నిర్మించాడు. దర్శకుడు దేవకట్టా తెరకెక్కించిన హిందీ ప్రస్థానంలో పెద్దగా మార్పులు ఏమి లేవని తెలుస్తోంది. 

కానీ స్టార్స్ ఉండడంతో సినిమా ఓ వర్గం ప్రేక్షకుల్ని ఆకర్షిస్తోంది. సినిమా ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే మొదట టీజర్ తో పెద్దగా ఆకట్టుకోలేని బాలీవుడ్ ప్రస్థానం ఇప్పుడు ట్రైలర్ తో కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది.ఒరిజినల్ కథకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సాయి కుమార్ పాత్రలో సంజయ్ దత్ సరికొత్తగా కనిపిస్తున్నారు. 

అలాగే జాకీ ష్రాఫ్ రోల్ సినిమాలో హైలెట్ కానుంది.  ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. వీలైనంత త్వరగా ఆ పనులను పూర్తి చేసి సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ లో పాల్గొనాలని సంజయ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా సెప్టెంబర్ 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.