బాహుబలి తరువాత అదే రేంజ్‌లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన సౌత్‌ సినిమా కేజీఎఫ్ 2. యష్‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సత్తా చాటింది. దీంతో ఈ మూవీ సీక్వెల్‌పై కూడా అదే రేంజ్‌లో హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. ముఖ్యంగా మెయిన్ విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ సీనియర్ హీరో సంజయ్ దత్ కనిపించనున్నాడు.

ఇప్పటికే సంజు బాబా నటించే అధీరా పాత్రకు సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అయితే అఫీషియల్‌గా ఫస్ట్‌ లుక్‌ మాత్రం బయటకు రాలేదు. చిత్రయూనిట్ అఫీషియల్‌ లుక్‌ రిలీజ్ చేయకముందే సినిమాలో సంజయ్‌ దత్‌ లుక్‌ లీకైంది. ప్రస్తుతం ఈ లుక్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యష్‌ ఫ్యాన్స్‌తో పాటు బాలీవుడ్ సినీ జనాలు కూడా ఈ ఫోటోను విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. ఈ సినిమాను ముందుగా అక్టోబర్‌ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే లాక్‌ డౌన్‌ తరువాత పరిస్థితి ఎంటో తెలియాల్సి ఉంది.

హెంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. సంజయ్ దత్‌ విలన్‌గా నటిస్తుండగా బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌ మరో కీలక పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌ లో రూపొందుతున్న ఈ సినిమాలో తెలుగు నుంచి రావూ రమేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరో కేజీఎఫ్‌ 2 రాఖీ భాయ్‌ మరోసారి రికార్డ్‌లు తిరగ రాస్తాడేమో చూడాలి.