హైదరాబాద్: నాని ఆతిథ్యం ఇస్తున్న బిగ్ బాస్ 2లో పాల్గొంటున్న హేతువాది బాబు గోగినేనిపై సంజన సంచలన వ్యాఖ్యలు చేసింది. బాబు గోగినేని ఓ సైకోగా అభివర్ణించింది. 

ఓ వెబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆ వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఐదు రోజులు తేజస్వి, బాబు గోగినేని వల్లే తాను ఎక్కువగా బాధపడ్డానని చెప్పింది. అందరిలో తనను వేరుగా చూస్తే బాధపడకుండా ఎలా ఉంటానని అన్నది. ఆయన అరాచకం భరించలేనిదని ఆమె అన్నది.

బాబు గోగినేని ఏం చేస్తున్నాడనేది జనం చూస్తున్నారని, జనం పిచ్చోళ్లు కారని అన్నది. తన విమర్శలను జనం సమర్థిస్తున్నారని చెప్పింది. గేమ్ ఆడితే స్ట్రెయిట్‌గా ఆడకుండా దొంగాట ఆడడమేమిటని ప్రశ్నించింది. బాబు గోగినేని అరాచకం అర్థం కావడం లేదని ఆరోపించింది.