ప్రభాస్ హీరోయిన్..సీక్రెట్ గా పెళ్లి చేసేసుకుంది,ఎవరినంటే..


మరో తెలుగు హీరోయిన్ వివాహం చేసుకుంది. ఆమె మరెవరో కాదు... పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బుజ్జిగాడు మూవీ లో సెకండ్ హీరోయిన్ గా పరిచయం అయిన సంజన గల్రాని. 

Sanjana Galrani's secret marriage pic jsp

మరో తెలుగు హీరోయిన్ వివాహం చేసుకుంది. ఆమె మరెవరో కాదు... పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బుజ్జిగాడు మూవీ లో సెకండ్ హీరోయిన్ గా పరిచయం అయిన సంజన గల్రాని. గత కొంతకాలంగా సినిమాలకన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఫోకస్ అవుతూ వస్తున్న ఆమె ఇప్పుడు అదే సోషల్ మీడియా జనాలకి పెళ్లి ఫొటోతో షాక్ ఇచ్చింది. సంజన పెళ్లి చేసేసుకోవటం పెద్ద విశేషం ఏమీ కాకపోయినా చెప్పాపెట్టకుండా చేసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కర్ణాటకకు చెందిన డాక్టర్ పాషాను సంజన పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సంజన ద్రువీకరించడమే కాదు.. పెళ్లి ఫోటో ని షేర్ చేసింది. సంజన సీక్రెట్ వివాహానికి కొద్దిమంది స్నేహితులు, బంధువులు హాజరయ్యారని సమాచారం.

ఇక సంజన ...తెలుగులో ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘సత్యమేవ జయతే’, ‘అవును 2’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తదితర చిత్రాల్లో నటించారు. ‘స్వర్ణ ఖడ్గం’ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. అయితే అక్కడ సరైన హిట్ కూడా పడకపోవడంతో ఆమె కన్నడకే పరిమితం అయిపోయింది. తెలుగులో అవకాశాలు రాక, లేక కన్నడ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంటే.. అక్కడ డ్రగ్స్ కేసులో జైలుకెళ్లాల్సి వచ్చింది. గత ఏడాది శాండిల్ వుడ్ ని పట్టి కుదిపేసిన డ్రగ్స్ కేసులో సంజన గల్రాని జైలుకెళ్లింది. దాదాపుగా మూడు నెలలపాటు జైల్లో ఉండి బెయిల్ పై బయటికొచ్చిన సంజన.. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా మారింది. రోజుకో ఫోటో షూట్ తో నానా హంగామా చేస్తుంది. 

చాలా కాలంగా ఆమె వివాహం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఆ మధ్యన సంజన తల్లి కూడా ఈ విషయాన్ని ఖరారు చేసింది. ఇక ఈ పెళ్లితోపాటు సంజనా డిజిటల్‌ రంగంలోకి కూడా అడుగు పెడుతుంది. అలాగే ఆత్మనిర్బర్‌ పేరుతో నటీనటుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంది సంజనా. త్వరలోనే తన డిజిటల్‌ మీడియాకు సంబంధించిన పేరు, ఇతర వివరాలను వెల్లడిస్తానని తెలియజేసింది సంజనా గల్రాని. ఇటీవలే సంజన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం బెయిల్ పై విడుదలైంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios