తెలియని వ్యక్తి పక్కన ఎలా పడుకుంటాను: సంజన

First Published 19, Jun 2018, 4:23 PM IST
sanjana comments on big boss2
Highlights

బిగ్ బాస్2 షోలో మొదటి ఎలిమినేషన్ లో బయటకు వచ్చేసింది సంజనా. విజయవాడకు చెందిన 

బిగ్ బాస్2 షోలో మొదటి ఎలిమినేషన్ లో బయటకు వచ్చేసింది సంజనా. విజయవాడకు చెందిన ఈ మోడల్ ప్రస్తుతం అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. నానిని కూడా విడిచిపెట్టలేదు.

''హౌస్ లో నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. నేను వెళ్లిన మొదటిరోజే మరో వ్యక్తితో కలిపి జైలులో వేశారు. చాలా బాధ కలిగించింది. గంట కూడా పరిచయం లేని వ్యక్తితో కలిసి పడుకోమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. అతడికి పక్కకు తిరిగి పడుకోండి, మధ్యలో తలగడులు పెట్టుకోమని సలహాలు ఇచ్చారు. బయట జైళ్లలో మహిళా ఖైదీలు ఉన్న సెల్ లో మహిళలనే వేస్తారు. కానీ బిగ్ బాస్ హౌస్ లో అలా జరగలేదు'' అంటూ చెప్పుకొచ్చింది. 

loader