సంఘమిత్ర చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పీసీ సుందర్ కథ పూర్తిగా చెప్పలేదంటూ వైైదొలగిన శృతిహాసన్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో తనను పెట్టలేదని శృతి అలిగిందని టాక్ సంఘమిత్రలో శృతిని రీప్లేస్ చేసిన నయనతార?

బాహుబలి చిత్రం తర్వాత దక్షిణాది నుంచి అంతటి గొప్ప సినిమా అవుతుందని అంచనాలున్న సంఘమిత్ర చిత్ర షూటింగ్ ప్రారంభానికి ముందే వివాదాలకు వేదికవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రిలీజ్ చేశారు. కేన్స్ లో పండుగ వాతావరణంలో సంఘమిత్ర ప్రమోషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. కేన్స్‌లో జరిగిన హంగామాకు సంఘమిత్ర పాత్రధారి శృతిహాసన్ కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ సంఘమిత్ర యూనిట్‌లో గందరగోళానికి కారణమైందనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది.

శృతిహాసన్‌ హీరోయిన్‌గా ‘సంఘమిత్ర' సినిమాను రూపొందిస్తున్నట్టు దర్శకుడు సుందర్ ప్రకటించగానే తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా ప్రారంభానికి ముందే కత్తిసాము, యుద్ధ పోరాటాలకు సంబంధించిన విద్యలను శిక్షణ పొందింది. ఇలాంటి అనేక అంశాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. బాహుబలి తర్వాత అంతటి రేంజ్ ఉన్న చిత్రమువుతుందనే అభిప్రాయాన్ని సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే అనూహ్యంగా సినిమా నుంచి తప్పుకోవడంతో సంఘమిత్ర సెట్స్‌పైకి వెళ్తుందా అనే మాట బలంగా వినిపించింది.

సంఘమిత్ర నుంచి శృతిహాసన్ తప్పుకోవడానికి కేన్స్ విడుదల చేసిన ఫస్ట్‌ లుక్ పోస్టరట. ఆ పోస్టర్‌ను చూసి జనాలు ముక్కున వేలేసుకోవడంతో శృతిహాసన్ కంగుతిన్నదట. ఆ పోస్టర్‌పై దారుణమైన కామెంట్లు రావడంతో శృతి మనస్తాపానికి గురైంది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది శృతిహాసన్ కాకపోవడంతో పోస్టర్‌పై చాలా విమర్శలు గుప్పించారు. కేన్స్ లాంటి వేదికలపై ఆవిష్కరించిన పోస్టర్‌లో తాను లేకపోవడం, పెయింటింగ్ చేయించడం ఆమె ఆగ్రహానికి కారణమైందట.

దాంతో స్క్రిప్టు సరిగా లేదని, ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి చాలా లేటు అవుతుందనే కారణాలను వెల్లడిస్తూ సంఘమిత్ర నుంచి శృతిహాసన్ తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాల డేట్లు ఇమ్మంటున్నారనీ, అది కుదరకనే తప్పుకున్నాని శృతి చెప్పిన మాటలలపై అనేక సందేహాలు తలెత్తాయి. తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న కారణంతోనే శృతి అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలా ఉండగా, శృతిహాసన్ తప్పుకోవడంతో హన్సిక, అనుష్క, నయనతార, తమన్నా లాంటి తారల పేర్లు పరిశీలనకు వచ్చాయి. హన్సికకు తెలుగు, తమిళ భాషల్లో మార్కెట్ అంతగా లేకపోవడం వల్ల బిజినెస్ అవుతుందా? క్రేజీ ప్రాజెక్ట్‌కు సరిపోయే సత్తా హన్సికలో ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి. అనుష్కను నిర్మాతలు సంప్రదించినా ఏ కారణంగానో వర్కవుట్ కాలేదు. తమన్నాకు కూడా మార్కెట్ అంశం ఓ అడ్డంకిగా మారింది. దాంతో నయనతార సరైన వ్యక్తి అని నిర్మాతలు ఫిక్స్ అయిపోయారనేది తాజా సమాచారం.

గ్లామర్ తారగానే కాకుండా మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ నయనతార ప్రశంసలు అందుకొంటున్నది. ఇటీవల వచ్చిన సినిమాలను నయనతార ఒంటిచేత్తో ముందుకు తీసుకెళ్లింది. ప్రొఫెషనల్‌గా నయనతార వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది నిర్మాతల అభిప్రాయం. రెండేళ్ల ప్రాజెక్ట్ కావడంతో చెంచల స్వభావంలేని, స్థిరత్వం కలిగిన హీరోయిన్‌గా పేరున్న నయనతారను ఓకే చేసినట్టు తెలిసింది. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు.