అర్జున్ రెడ్డి చిత్రంలో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా హిందీలోనూ కబీర్ సింగ్ తో అంతకు మించి అన్న స్దాయిలో హిట్ కొట్టారు. దాంతో హిందీ, తెలుగు పరిశ్రమలలో ఆయనకు ఎదురే లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో ఆయన తన తదుపరి చిత్రం ఏం చేయబోతాడు అనే విషయమై అంతటా  చర్చనీయాంశంగా మారింది.  అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వూలో ఆయన నెట్ ఫ్లిక్స్ వాళ్లకు లస్ట్ స్టోరీస్ తరహాలో ఓ సినిమా చేయటానికి కమిటైనట్లు తెలియచేసారు.

సందీప్ లస్ట్ స్టోరీస్ చేయటం ఏమిటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే అర్జున్ రెడ్డి చిత్రంలో రొమాన్స్ సైతం అదే స్దాయిలో అంత రా గా చూపించాడు కాబట్టే ఆయన్ని వెతుక్కుంటూ ఆ ఆఫర్ వచ్చిందని చెప్తున్నారు. 
 
హిందీలో వెబ్ సీరిస్ లు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లకు లస్ట్ స్టోరీస్ ఖచ్చితంగా పరిచయమే.  అయితే ఇది రెగ్యులర్ సినిమా సినిమా కాదు. ఇది నెట్ ఫ్లిక్స్ తీసిన మూవీ. అంటే నెట్ లోనే చూసే వీలుంటుంది. టైటిల్ లో చెప్పినట్టుగా ఇది ఈతరం నగర జీవితాల్లోని పెళ్లయిన ఆడవాళ్ల సీక్రెట్ అఫెయిర్ల చుట్టూ తిరిగే కథ ఇది.  లస్ట్ స్టోరీస్ లో కియారాతోపాటు రాధికా ఆప్టే - భూమి పెడ్నేకర్ - మనీషా కొయిరాలా హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ లోని నలుగురు ఫేమస్ డైరెక్టర్లు ఈ నెట్ సిరీస్ ను డైరెక్ట్ చేసారు.  
  
ఇక ఇది హిందీ లస్ట్ స్టోరీస్ కు రీమేక్ చేయటమా లేక డైరక్టర్ గా ఇక్కడ కొన్ని కథలు అనుకుని తెరకెక్కించటం చేస్తారా అనేది తెలియరాలేదు. అయితే భారీ ఎత్తున ఇక్కడ హీరోయిన్స్ తో ఆ తరహా కథలు చేస్తారని మాత్రం చేసింది.