గత  కొద్ది  రోజులుగా సందీప్ రెడ్డి వంగ వివాదంలో మునిగితేలుతున్నారు. ఆయనకు సపోర్ట్ చేసే కొందరైతే, విమర్శించే సెలబ్రెటీలు మరో ప్రక్క సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. దాంతో ఆయన పేరు మీడియాలో మారు మ్రోగుతోంది. కబీర్ సింగ్ విజయం కన్నా ఈ వివాదమే ఎక్కువ పబ్లిసిటీ ఇస్తోందన్నది నిజం. అయితే ఈ వివాదం సందీప్ రెడ్డిని బాధపెడుతోందట. 

తను కబీర్ సింగ్ విజయం అస్వాదించకుండా ఈ తలనొప్పి ఏమిటా అని తల పట్టుకుంటున్న టైమ్ లో అందుకు కారణం చెప్పుకొచ్చాడు. అది మరేదో కాదు...తన ఇచ్చిన ఇంటర్వూని యధాతధంగా ఉంచకుండా తమ ఇష్టం వచ్చినట్లు ఎడిట్ చేసేసారట. దాంతో తన వివాదాస్పద కామెంట్ ముందు , వెనక మాట్లాడింది జనాలకు తెలియకుండా పోయిందని ఆయన చెప్పుకొచ్చారు. 

ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను కబీర్ సింగ్ సినిమాలో హీరో మైండ్ సైట్ ఎంటి అనేది వివరించాను. వయిలెన్స్ అనేది అతని ప్రేమను వ్యక్తం చేసే ఓ దారి. అంతే తప్ప ఆ దారి నాది కాదు. ఆ పాత్రది నాకు ఆపాదించవద్దు,” అని చెప్పుకొచ్చారు. రివ్యూ రైటర్స్ పై విరుచుకుపడటం గురించి చెప్తూ... నా సినిమాలో ఏవో రెండు పాయింట్లు తీసుకుని వాటిని హైలెట్ చేస్తూ రివ్యూ రాయటం మాత్రం పద్దతి కాదు, వాళ్లు అనుకున్న విలువలు నా సినిమాలో కనపడకపోతే అదేదో తప్పు అన్నట్లు హైలెట్ చేస్తారు. వాళ్ల కళ్లలో ద్వేషం నాకు స్పష్టంగా కనపడింది అన్నారు. 

ఇంతకీ వివాదం ఏంటంటే... కబీర్ సింగ్  సినిమాలో షాహిద్‌ కపూర్‌.. కియారా అడ్వాణీని ముద్దుపెట్టుకునే సన్నివేశాల గురించి సందీప్‌ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్‌ కనిపించదని నా అభిప్రాయం’ అన్నారు.  అదే వివాదం తెచ్చి పెట్టింది.